Home » Jaggareddy
తాను ఓడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిచి ఆయన కోటాలోనే తన భార్య నిర్మలకు పదవిచ్చారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. ఏ పండుగ వచ్చినా ముందుండి సంగారెడ్డిలో కార్యక్రమాలు చేస్తానని చెప్పారు. జగ్గారెడ్డి ఎప్పుడు బలహీనుడు కాదని, అదిరేటొడు.. బెదిరేటోడు కాదని.. జగ్గారెడ్డి ఓ ఫైటర్ అని అన్నారు. ప్రాణికి చావుంది కానీ పైసాకు చావు లేదు
రాహుల్‌గాంధీ ఇంటి ముందు.. హరీశ్ రావు ధర్నాకు దిగితే.. అదే రోజున కేసీఆర్ ఇంటి ముందు తాను దీక్షకు దిగుతానంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి ప్రకటించారు.
Telangana: రుణమాఫీకి సంబంధించి మాజీ మంత్రి హరీష్‌రావుకు జగ్గారెడ్డి ఛాలెంజ్ విసిరారు. రుణమాఫీపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధమా అంటూ సవాల్ చేశారు. రుణమాఫీపై రైతులతో చర్చ చేద్దామని.. ఎల్లిగాడు, మల్లిగాడు కాకుండా కేసీఆర్ చర్చకు రావాలన్నారు.
‘‘ఈ దేశాన్ని 52 ఏళ్లు పాలించిన రాహుల్ గాంధీ కుటుంబం.. ప్రస్తుతం నివాసం ఉంటున్నది ప్రభుత్వ బంగళాలోనే. వారు సంపాదించిన ఆస్తి అదే.
సోషల్ మీడియాలో మంత్రి కొండా సురేఖను(Konda Surekha) కించపరుస్తూ ట్రోల్ చేయడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తప్పుడు ట్రోలింగ్‌ను ఖండిస్తున్నట్లు చెప్పారు.
హైడ్రా అధికారులకు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అల్టిమేటం జారీ చేశారు. హైడ్రా పేరుతో సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించకండి అని హెచ్చరించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో కూల్చివేతల పేరిట అధికారులు అతుత్సాహం ప్రదర్శించకండి అని అన్నారు.
తిరుమల లడ్డూ వివాదం వెనుక బీజేపీ కుట్ర ఉందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి.. అనుమానం వ్యక్తం చేశారు.
Telangana: తిరుమల లడ్డు వివాదం వెనక బీజేపీ కుట్ర ఉందంటూ జగ్గారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డు కల్తీ అయిందన్న వివాదంలో వాస్తవాలు ఏమిటి, జరిగింది ఏంటి అన్న విషయాలు మాత్రమే చర్చిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయన్నారు.
‘‘ప్రత్యర్థి.. నన్ను రాజకీయంగా కత్తితో పొడవాలని వస్తే నేను ఊర్కోను. ఎదురుదాడి చేస్తా. అదే రాజనీతి’’ అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం.. సమానత్వమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు.