Home » Jammu and Kashmir
దోడా జిల్లాలోని శివగడ్- అస్సాడ్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల నక్కి ఉన్నారని భద్రతా దళాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో భారత సైన్యంతోపాటు జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా అటవీ ప్రాంతంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఆ క్రమంలో ఈ రోజ ఉదయం ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో కెప్టెన్ దీపక్ సింగ్ మృతి చెందారు.
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో నగారా మోగనుంది. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం వడివడిగా అడుగులు వేస్తుంది. ఆ క్రమంలో బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ బల్లాతో కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్రంలో భద్రత పరిస్థితులపై కేంద్ర హోం శాఖ కార్యదర్శితో ఈసీ సమావేశమై సమీక్షించనుంది.
ఒకే చోట 10,000 మంది యువతులు నృత్యం చేస్తే ఎలా ఉంటుంది. ఆ దృశ్యం మాములుగా ఉండదని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే బారాముల్లా(Baramulla district)కు చెందిన 10 వేల మంది బాలికలు 'కషూర్ రివాజ్' సాంస్కృతిక ఉత్సవంలో అతిపెద్ద కశ్మీరీ జానపద నృత్యాన్ని ప్రదర్శించి ప్రపంచ రికార్డు సృష్టించారు.
జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన భీకర కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు అమరులయ్యారు. మరో నలుగురు గాయపడ్డారు.
జమ్మూకశ్మీర్(jammu and kashmir)లో మళ్లీ కాల్పులు(firing) కలకలం రేపుతున్నాయి. అనంత్నాగ్ జిల్లా(Anantnag district)లోని మారుమూల అటవీ ప్రాంతంలో శనివారం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందగా, మరో ముగ్గురు గాయపడ్డారు.
భారత దేశ చరిత్రలో ఆర్టికల్ 370 రద్దు కీలక మలుపు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నాటి నిర్ణయం ప్రజల సమ్మతితోనే జరగాలని భావించానని ఆయన తెలిపారు. ఐదేళ్ల క్రితం తాము తీసుకున్న నిర్ణయం జమ్మూ, కశ్మీర్, లఢఖ్లలో కొత్త శకానికి నాంది అని మోదీ వ్యాఖ్యానించారు.
గత ఐదేళ్లలో బీజేపీ పాలనలో జరిగిన జమ్మూ కశ్మీర్ అభివృద్ధి కాంగ్రెస్ కనిపించడం లేదా అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, జమ్మూ కశ్మీర్ బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
మోదీ ప్రభుత్వం ‘ఆర్టికల్ 370’ని రద్దు చేసి.. నేటికి అంటే ఆగస్ట్ 5వ తేదీకి అయిదేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో ఆర్ఎస్ పురాలోని బానా సింగ్ స్టేడియంలో ఏకాత్మ మహోత్సవ్ ర్యాలీని బీజేపీ చేపట్టనుంది. సరిగ్గా అయిదేళ్ల క్రితం ఇదే రోజున అంటే.. 2019, ఆగస్ట్ 5వ తేదీన ఆర్టికల్ 370ని మోదీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.
దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఆరుగురిని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగించింది. వీరిలో ఐదుగురు పోలీసులు, ఒక ఉపాధ్యాయుడు ఉన్నట్టు అధికారులు శనివారం వెల్లడించారు.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన సన్నాహకాలను సమీక్షించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకూ జమ్మూకశ్మీర్లో పర్యటించనుంది.