Home » Jammu and Kashmir
భారతీయులు తామేంటో చూపిస్తే, విదేశీయులు భారత్ పై ఉన్న నమ్మకాన్ని అణువంత కూడా సడలించుకోలేదు. భారత సర్కారుపై ఉన్న అచంచల విశ్వాసం.. వాళ్ల నడక, నడవడికలో కనిపిస్తున్నాయ్..
పహల్గాంపై ఎన్ఐఏ దర్యాప్తులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదులు ఈ నరమేధాన్ని తమ కెమెరాల్లో రికార్డు చేసినట్టు గుర్తించారు.
జమ్మూ కశ్మీర్ పహల్గామ్‌లో ఉగ్రవాద దాడుల తర్వాత ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఈ దాడి ఘటన తర్వాత పహల్గామ్‌లోని పర్యాటకుల సంఖ్య పెరిగిపోవడం విశేషం. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
Pahalgam Terror Attack: జమ్మూకాశ్మీర్, పహల్గామ్‌లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని కుదిపేసింది. ఉగ్ర మూక 26 మంది అమాయక పౌరుల ప్రాణాలను బలి తీసుకుంది. ఉగ్రవాదులు పర్యాటకుల మతం ఏంటో కనుక్కుని మరీ చంపేశారు. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఓ ముస్లిం వ్యక్తిని కూడా కాల్చేశారు.
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి రోజుకో కొత్త విషయం తెలుస్తోంది. ఈ దాడి వెనుక ఉన్న కుట్రను బయటపెట్టేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నేతృత్వంలో జరుగుతున్న దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు దాడికి ముందు బిగ్ ప్లాన్ వేశారని వెల్లడించారు.
Pahalgam Terror Attack: దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల్ని, వారికి సాయం చేసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఎన్ఐఏ ప్రాథిమిక దర్యాప్తులో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. నలుగురు టెర్రిస్టులు.. రెండు గ్రూపులుగా విడిపోయారు. రెండు వైపుల నుంచి పర్యాటకులపై కాల్పులు జరిపారు.
జమ్మూకశ్మీర్‌లో వివిధ ఉగ్రవాదులకు చెందిన ఇళ్లను భద్రతా దళాలు ధ్వంసం చేస్తున్నాయి. కొన్ని చోట్ల బుల్డోజర్లతో కూల్చివేసి మరికొన్ని చోట్ల ఐఈడీలతో పేల్చి వేస్తున్నాయి.
ఏప్రిల్ 22 పహల్గాం మారణహోమంకి సంబంధించి కీలక విషయాలు ఒక్కక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఉగ్రదాడిలో కీలక నిందితుడైన ఆదిల్ అహ్మద్ థోకర్, ఆసిఫ్ షేక్ గురించి మరింత ముఖ్య సమాచారం తెలిసింది.
Kashmir Travel After Terror Attack: పహల్గాంలో ఉగ్రవాదులు సృష్టించిన రక్తపాతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాశ్మీర్ లో అడుగు పెట్టాలంటేనే పర్యాటకులు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి స్థితిలోనూ ఓ మహిళా టూరిస్ట్ చూపిన తెగువకు అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు చనిపోయారు. అమాయకులైన పర్యాటకులు చనిపోవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది.