Home » Jammu and Kashmir
శ్రీనగర్ : భారత్ సరిహద్దుల్లో దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan) రెచ్చిపోతోంది. ఎల్ఓసీ (Loc) వెంబడి భారత భూభాగంలోకి దగ్గరుండి మరీ సాయుధ ఉగ్రవాదులను పంపిస్తోంది. వీరికి పాక్ సైనికులు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు తాజాగా వెలుగుచూశాయి.
ఒక్క నెలలోనే ఆరు ఉగ్ర దాడులు జమ్మును కుదిపేశాయి. 20 మందికిపైగా ఆర్మీ జవాన్లను పొట్టనబెట్టుకున్న ఈ దాడులను రక్షణ శాఖ సవాల్గా తీసుకుంది. జమ్ము పరిధిలోని దట్టమైన అడవుల్లో దాగి, ఆర్మీపై దొంగ దాడులు చేస్తున్న ముష్కరుల పని పట్టేందుకు 500 మందితో కూడిన పారా కమాండో దళాన్ని రంగంలోకి దించింది.
భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలు మరింతగా ప్రొత్సహించే విధంగా పొరుగునున్న దాయాది దేశం పాకిస్థాన్ వ్యవహరిస్తుంది. అందుకోసం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని కోట్లి ప్రాంతంలో ఉగ్రవాద శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసింది.
జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు భారత ఆర్మీ సైనికులు అశువులు బాయడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. పదేపదే భద్రతా లోపాలు తలెత్తడానికి కేంద్ర బాధ్యత వహించాలని అన్నారు. దేశానికి, వీరసైనికులకు కీడు తలబెడుతున్న దుండగులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు.
జమ్మూ కశ్మీర్ దోడా జిల్లాలోని భరద్వాలో జరిగిన ఎన్కౌంటర్లో ఉన్నతాధికారితో సహా నలుగురు సైనికులు మరణించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని జైషే ఈ మహమ్మద్ అనుబంధ సంస్థ కశ్మీర్ టైగర్స్ మంగళవారం ప్రకటించింది.
జమ్మూ-కాశ్మీర్లోని దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు భారత ఆర్మీ సైనికులు వీరమరణం పొందిన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రంగంలోకి దిగారు.
ఉగ్రవాదులను తుదముట్టించే పోరులో మరో నలుగురు భారత ఆర్మీ సైనికులు అసువులు బాశారు. జమ్మూ కాశ్మీర్లోని దోడాలోఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో జవానులు వీరమరణం పొందారు. సోమవారం రాత్రి దోడా జిల్లాలోని దేసా ప్రాంతంలో జరిగింది.
భార్య నుంచి విడాకులు మంజూరు చేయాలంటూ వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
విడాకులు కోరుతూ జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వేసిన పిటిషన్పై ఆయన భార్యకు సుప్రీంకోర్టు సోమవారంనాడు నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా ఆమె సమాధానం ఇవ్వాలని న్యాయమూర్తులు సుధాన్షు ధులియా, అసనుద్దీన్తో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
జమ్మూకశ్మీర్లోని(Jammu Kashmir) రాష్ట్రం అనంత్నాగ్ జిల్లాలో 30 ఏళ్ల తర్వాత ఉమా భగవతీ దేవి ఆలయాన్ని ఆదివారం కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సమక్షంలో తెరిచినట్లు అధికారులు తెలిపారు.