Home » Jammu and Kashmir
హంగ్ ఖాయమనే అంచనాలు.. నామినేటెడ్ ఎమ్మెల్యేల ఓట్లు కీలకమనే ఆందోళనలు.. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు తప్పవన్న సంకేతాలు..!
సరిగ్గా ఆరు నెలల కిందట జరిగిన లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి చేతిలో పరాజయం పాలైన ఆయన.. ఆ దెబ్బ నుంచి కోలుకుని అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటారు. పోటీ చేసిన రెండుచోట్లా గెలిచి.. పదేళ్ల విరామం తర్వాత సీఎం పదవిని చేపట్టనున్నారు.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని తాము ఆమోదించబోమని, రాష్ట్రంలో మార్పును కోరుకున్న ప్రజల అభిమతానికి భిన్నంగా ఈ ఫలితం ఉందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
జమ్మూలో బీజేపీ విజయం చరిత్రాత్మకమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి.. బీజేపీ జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఇన్చార్జ్ కిషన్రెడ్డి అన్నారు.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూ అండ్ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్కూటమి మెజారిటీ మార్క్ను దాటి అధికార పీఠాన్ని ఖాయం చేసుకుంది.
పదేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్లో ఎన్నికలు జరిగి, కొత్త ప్రభుత్వం ఏర్పడుతోంది. నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి అధికార పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయం కాగా, చిన్న పార్టీలకు మాత్రం ఈ ఎన్నికల్లో గ్రహణం పట్టింది.
రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లానే అని ఆయన ప్రకటించారు. దశాబ్దం తర్వాత జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ఓటర్లు కచ్చితమైన తీర్పు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. అల్లా సైతం తమ ప్రార్థనలను ఆలకించారని ఈ సందర్భంగా తెలిపారు.
JK-Haryana Election Results 2024 LIVE Updates in Telugu:జమ్మూ కశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నిల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంమైంది. హరియాణాలో 90 అసెంబ్లీ సీట్లు ఉండగా ఈనెల 5న జరిగిన పోలింగ్లో 65.65శాతం ఓటింగ్ నమోదైంది.
హరియాణా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. హరియాణాలో బీజేపీ దూసుకెళ్తుండగా.. జమ్మూ కశ్మీర్లో ఇండియా కూటమి హవా కొనసాగిస్తోంది.
శ్రీగుఫ్వారా – బిజ్బెహరా (Srigufwara – Bijbehara)నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా ముఫ్తీ (Iltija Mufti) ఓటమి పాలయ్యారు.