Home » Jammu and Kashmir
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి తుది విడత పోలింగ్ మంగళవారం జరగనుంది. అందుకు కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్దం చేసింది. ఈ దశలో 7 జిల్లాల్లోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ విడతలో మొత్తం 3.9 మిలియన్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
జమ్మూకశ్మీర్‌లో తొలి రెండు విడతల్లో రికార్డు స్థాయిలో పాల్గొన్న ఓటర్లకు రాజీవ్ కుమార్ అభినందనలు తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 58.58 శాతం పోలింగ్‌తో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతాన్ని పోల్చారు. మొదటి విడతలో 61.38 శాతం, రెండో విడతలో 57.3 శాతం పోలింగ్ నమోదైనట్టు చెప్పారు.
హర్యానా, జమ్మూకశ్మీర్‌లో ప్రధాన అంశాలు, పార్టీ వైఖరిని ఏఎన్ఐకి సోమవారంనాడిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జైరామ్ రమేష్ వివరించారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.
జమ్మూకశ్మీరులోని కథువా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు.
జమ్మూకశ్మీర్ అభివృద్ధి కోసం కేంద్రం నిధులు ఉస్తుంటే, పాకిస్థాన్ మాత్రం చాలాకాలంగా ఆర్థిక సాయాన్ని దుర్వినియోగం చేస్తోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. సొంతగడ్డపై ఉగ్రవాద ఫ్యాక్టరీని నడిపేందుకు ఇతర దేశాల నుంచి పాకిస్థాన్ డబ్బులు కోరుతోందన్నారు.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల(Jammu Kashmir Assembly Elections 2024) ప్రచారంలో ప్రధాన పార్టీలు జోరు పెంచాయి. అయితే.. కతువా జిల్లాలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అనూహ్య ఘటన జరిగింది
హిజ్బుల్లాకు మద్దతుగా వందలాది మంది బుద్గావ్లో ఆదివారం జరిగిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. మరోవైపు, హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా మృతికి నిరసనగా ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేస్తున్నట్టు పీడీపీ చీఫ్ మొహబూబా ముఫ్తీ ప్రకటించారు.
బీజేపీ గెలుపు అవకాశాలపై ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, సొంతంగా మెజారిటీ సాధించేందుకు అవసరమైన సీట్లులో వాళ్లు పోటీ చేయలేదన్నారు. కశ్మీర్లో చాలా స్థానాల్లో వాళ్లు పోటీ చేయలేదని, జమ్మూలోనూ ఎక్కువ సీట్లు గెలుచుకునే పరిస్థితిలో ఆ పార్టీ లేదని చెప్పారు.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి శనివారంనాడు జమ్మూలోని బిష్ణహ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొన్నారు.
బీజేపీ ప్రభుత్వాన్ని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అక్టోబర్ 1న తుది విడత పోలింగ్ నేపథ్యంలో శనివారంనాడిక్కడ జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ పాల్గొన్నారు.