Home » Jammu and Kashmir
జమ్మూ కశ్మీర్ మూడో విడత ఎన్నికల పోలింగ్ మరికొద్ది రోజుల్లో జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ నేడు ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. అందులోభాగంగా జమ్మూలోని ఎమ్ఏ స్టేడియంలో నిర్వహించే బీజేపీ సంకల్ప్ మహా ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. ఇక ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్ అక్టోబర్ 1వ తేదీన జరగనుంది. ఈ విడతలో జమ్మూ డివిజన్లో మిగిలిన 24 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెనగా గుర్తింపు పొందింది. వంపు వంతెన నిర్మాణంలో భాగంగా 2017 నవంబర్:లో బేస్ సపోర్ట్ పూర్తైనట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. 2021 ఏప్రియల్లో చీనాబ్ రైలు వంతెన ఆర్చ్ పనులు పూర్తికాగా..
జమ్మూలోని శ్రీమాతా వైష్ణోదేవి సీటులో అత్యధికంగా 75.29 శాతం పోలింగ్ నమోదు కాగా, పూంచ్-హవేలీలో 72.71 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. కశ్మీర్లోని 15 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఖాన్సాహెబ్ సెగ్మెంట్లో 67.70 శాతం, కంగన్ (ఎస్టీ)లో 67.60, చరర్-ఇ-షరీఫ్లో 66 శాతం పోలింగ్ నమోదైంది.
దాదాపు దశాబ్దం తర్వాత జరుగుతున్న ఎన్నికలు. అది కూడా ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో ఎన్నికల పోలింగ్ ప్రక్రియను 15 మంది వివిధ దేశాల దౌత్యవేత్తల బృందం పరిశీలిస్తుంది. అందుకోసం బుధవారం ఉదయం ఈ ప్రతినిధి బృందం శ్రీనగర్ చేరుకుంది. అనంతరం ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లోని పోలింగ్ సరళిని పరిశీలించి.. ఓటర్లతో ఈ ప్రతినిధి బృందం మాట్లాడుతుంది.
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం రెండో విడత పోలింగ్ కొనసాగుతుంది. ఈ ఎన్నికల పోలింగ్ ఉదయం 7.00 గంటలకు ప్రారంభమైంది. దీంతో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. ఈ విడతలో రాష్ట్రంలో ఆరు జిల్లాలోని మొత్తం 26 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.
పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో.. రెండో దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది!
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పూంచ్ జిల్లాలో సోమవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ, పహరి, గుజ్జర్ కమ్యూనిటీల మధ్య చీలకలు తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని, ఆ పార్టీ యత్నాలు విఫలమవుతాయని అన్నారు.
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. అందులోభాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు ర్యాల్లీల్లో పాల్గొనున్నారు. ఈ రోజు సాయంత్రం 5.00 గంటలకు ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. బుధవారం రాష్ట్రంలోని 26 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.
దశాబ్దాలపాటు తీవ్రవాదం, వేర్పాటువాదం, ఎన్నికల బహిష్కరణలు వంటి సమస్యలతో సతమతమైన జమ్ముకశ్మీర్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది.
లోక్సభలో కాంగ్రెస్ విపక్ష నేత రాహుల్ గాంధీ జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారంనాడు రెండు ర్యాలీల్లో పాల్గొంటారు. కాంగ్రెస్, కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం సాగిస్తారు.