Home » Jammu and Kashmir
భారతీయ జనతా పార్టీ ఉద్దేశాలపై ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నర్ పాలన కొనసాగించేందుకు హంగ్ అసెంబ్లీనే బీజేపీనే కోరుకుంటోందని ఆరోపించారు. అయితే ప్రజలు అందుకు అంగీకరించరని చెప్పారు.
జైళ్ల నుంచి ఉగ్రవాదులను విడిచిపెట్టాలని విపక్షాలు కోరుకుంటున్నాయనీ, ఏ ఒక్క ఉగ్రవాదని కానీ, రాళ్లు రువ్వే వాళ్లను కానీ జైళ్ల నుంచి తాము విడిచిపెట్టేది లేదని అమిత్షా తేల్చిచెప్పారు.
జమ్మూకశ్మీర్ లోని బుద్గాం జిల్లాలో శుక్రవారంనాడు ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. పుల్వామా నుంచి బుద్గాం వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ కింద నున్న లోయలోకి జారిపడటంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందారు.
జమ్ము, కశ్మీర్ను రాజకీయంగా, ఆర్థికంగా, భావోద్వేగాల పరంగా అనుసంధానించే వారధి 'దర్బార్ మూవ్' అని ఫరూక్ అబ్దుల్లా గుర్తు చేశారు. ఇందువల్ల రెండు ప్రాంతాల మధ్య ఎలాంటి విభజన ఉండదని, అది ఎంతమాత్రం సరికాదని ఆయన అన్నారు.
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో రాజకీయ పార్టీలు క్షణం తీరిక లేకుండా ఉన్నాయి. ఆర్టికల్ 370 గురించి మరోసారి చర్చకు దారితీసింది. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పాకిస్థాన్ వైఖరిని కేంద్ర ప్రభుత్వం ఎండగట్టింది.
జమ్ము, కశ్మీర్లో 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. 59 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. జమ్ము,
10 ఏళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్లో ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు అక్కడి ప్రజలు ఓట్లు వేస్తున్నారు. ఏడు జిల్లాల్లో తొలి దశలో 24 స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ అక్కడి ఓటర్లను విజ్ఞప్తి చేస్తు ఓ ట్వీట్ చేశారు.
జమ్మూకశ్మీరులో ఉగ్రవాదాన్ని అథఃపాతాళానికి తొక్కేస్తామని, మళ్లీ అది పైకి లేవకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు.
జమ్మూకశ్మీర్ను తిరిగి ఉగ్రవాదం వైపు నెట్టే ఆలోచనలో కాంగ్రెస్, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ఉన్నారని కేంద్ర హోం మంత్రి అమిత్షా అన్నారు. కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే ఉగ్రవాదంపై మెతక వైఖరి ప్రదర్శిస్తాయని విమర్శించారు.
జమ్ము, కశ్మీర్లోని బారాముల్లాలో జరిగిన ఎన్కౌంటర్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రధాని మోదీ పర్యటనకు ముందు జరిగిన ఈ ఎన్కౌంటర్ తీవ్ర కలకలం రేపింది. ఈ ఎన్కౌంటర్కు సంబంధించిన డ్రోన్ ఫుటేజ్ తాజాగా బయటకు వచ్చింది