Home » Japan
వాతావరణం అనుకూలించక విమానాలు రద్దు కావడమో.. ఆలస్యమవడమో సాధారణమే. కానీ, ఇలాంటి సమస్య లేకుండానే జపాన్లోని న్యూ చిటోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 36 విమానాలు రద్దయ్యాయి.
జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిద సంచలన ప్రకటన చేశారు. ప్రధాని పదవి నుంచి తాను వైదొలగనున్నట్టు బుధవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. వచ్చే నెలలో జరిగే అధికారిక లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఎన్నికల్లో సైతం తాను పోటీ చేయడం లేదని వెల్లడించారు.
జపాన్(Japan)లో గురువారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7.1 తీవ్రతతో భూకంపం(Earthquake) నమోదైంది. నైరుతి దీవులైన క్యుషు, షికోకోను ఇది వణికించింది.
నేడు వారంలో మొదటి రోజైన సోమవారం (ఆగస్టు 5న) దేశీయ స్టాక్ మార్కెట్కు(stock market) బ్లాక్ సోమవారంగా నిలిచిపోయింది. అయితే అమెరికా-జపాన్ మార్కెట్ల క్షీణత సందర్భంగా భారత్ ఎకానమీపై ప్రభావం చూపుతుందా అని పలువురు ప్రశ్నిస్తు్న్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
సాధారణంగా భర్తలు తాము సంపాదించిన కష్టార్జితాన్ని భార్యల చేతుల్లో పెడుతుంటారు. కాకపోతే.. తమ ఖర్చులకు కావాల్సిన కొంత డబ్బు తీసుకొని, మిగిలిన మొత్తాన్ని ఇంటి ఖర్చులకు గాను భార్యలకు ఇస్తారు.
అభివృద్ధి చెంది, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన జపాన్ని(Japan Population) ఇప్పుడు ఓ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇబ్బడిముబ్బడిగా జనాభా పెరిగిపోతుండగా.. జపాన్లో మాత్రం పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది.
జపనీస్ శాస్త్రవేత్తలు(Japan Scientists) మానవ చర్మంతో రోబోకి ముఖాన్ని రూపొందించి అరుదైన రికార్డు సృష్టించారు. మానవ చర్మంతో రూపొందించిన చిరునవ్వుతో ఉన్న ఈ ముఖాన్ని హ్యుమనాయిడ్ రోబోకి జత చేయవచ్చు. రోబోల ముఖ కవళికలు అచ్చం మనిషిలా ఉండాలనే ఉద్దేశంతో వీటిని తయారు చేసినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు.
కొవిడ్ మహమ్మారి పీడ విరగడవడంతో ఊపిరిపీల్చుకుంటున్న వేళ మరో అరుదైన కలవరానికి గురిచేస్తోంది. జపాన్లో స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (STSS) అనే బ్యాక్టీరియా వ్యాపిస్తోంది. ఇది అత్యంత అరుదైన, ప్రాణాంతకమైన వ్యాధి అని, ఇది సోకితే 48 గంటల్లోనే మరణిస్తారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి
ప్రపంచ దేశాలు కొవిడ్-యుగం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఇంకా చాలా చోట్ల దీని ప్రభావం పూర్తిగా తగ్గలేదు. రకరకాల వేరియెంట్స్తో ఇది జనాల జీవితాలను అస్తవ్యస్తం..
గర్భిణీ స్త్రీలు సాధారణంగా కష్టమైన పనులు చేయరు. నెలలు నిండే కొద్దీ వారి పరిస్థితి మరింత క్లిష్టమవుతుంది. చివరి నెలలో వారు నడవడం కూడా కష్టమవుతుంది. అయితే జపాన్కు చెందిన ఓ మహిళ ఆ సమయంలో కూడా తన పరిస్థితిని పట్టించుకోకుండా భర్త కోసమే ఆలోచించింది.