Home » Japan
చంద్రునిపై విజయవంతంగా కాలుమోపిన జపాన్ మూన్ ల్యాండర్ (Smart Lander for Investigating Moon - SLIM) తాజాగా మరో అద్భుతం నమోదు చేసింది. జాబిల్లిపై రాత్రిని తట్టుకొని, తిరిగి ప్రాణం పోసుకుంది. ఈ విషయాన్ని జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ (JAXA - జాక్సా) సోమవారం ఎక్స్ వేదికగా తెలిపింది. ఆదివారం రాత్రి తాము స్లిమ్కు ఒక కమాండ్ పంపించామని, దానికి స్పందన వచ్చిందని ఆ సంస్థ పేర్కొంది.
బాబా వంగా.. ఈ బ్లైండ్ బల్గేరియన్ ఆధ్యాత్మిక వేత్త గురించి తెలియనివారంటూ ఎవరూ ఉండరు. ఎలాగైతే బ్రహ్మంగారు చెప్పిన జోస్యాలు ఒక్కొక్కటిగా నిజమవుతూ వస్తున్నాయో.. అలాగే బాబా వంగా వేసిన ప్రెడిక్షన్స్ కూడా దాదాపు నిజమయ్యాయి. 9/11 తీవ్రవాద దాడులు, యువరాణి డయానా మరణం, చెర్నోబిల్ విపత్తు, బ్రెగ్జిట్ వంటి కొన్ని సంఘటనల్ని ఆమె ముందే అంచనా వేశారని చెప్తుంటారు.
డొమినోస్ లో పనిచేసే ఓ ఉద్యోగి చేసిన పనికి సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది.
తన స్థానాన్ని పదిలం చేసుకుని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనకున్న జపాన్(Japan) ఆశలు ఆడియాసలయ్యాయి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించి నాలుగో స్థానానికి పడిపోయింది. గురువారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. జర్మనీ జీడీపీ 2023లో 4.4 ట్రిలియన్ డాలర్లు కాగా, జపాన్ జీడీపీ 4.29 ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది.
సాధారణంగా.. ఏ రంగంలో అయినా వృత్తికి, వ్యక్తిగత జీవితానికి సంబంధం ఉండదు. వృత్తిలో ఫలానా వ్యక్తి ప్రతిభను మాత్రమే లెక్కలోకి తీసుకుంటారే తప్ప, వ్యక్తిగత జీవితంలో ఏం చేస్తున్నారన్న విషయాన్ని అస్సలు పట్టించుకోరు. కానీ.. మిస్ జపాన్ టైటిల్ సొంతం చేసుకున్న కరోలినా షినో విషయంలో మాత్రం అలా జరగలేదు.
ఈ ఏడాది మిస్ జపాన్గా నిలిచిన 26 ఏళ్ల మోడల్ కరోలినా షినో ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్లో పుట్టి జపాన్లో పెరిగిన ఈ సుందరి తను గెలుచుకున్న ``మిస్ జపాన్`` టైటిల్ను వెనక్కి ఇచ్చెయ్యాలని నిర్ణయించుకుంది.
ఎన్నో దేశాల ప్రజలకు 60ఏళ్లు బ్రతకడం గగనమవుతుంటే జపాన్ ప్రజలు మాత్రం ఎంచక్కా 100ఏళ్లు ఖాతాలో వేసుకుంటున్నారు. వారి సీక్రెట్ ఇదే..
జపాన్లో తాజాగా మళ్లీ భూకంపం సంభవించింది. సెంట్రల్ జపాన్లో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే, సునామీ హెచ్చరికలేవీ జారీ చేయలేదు. జనవరి 1వ తేదీన సెంట్రల్ జపాన్లోని కొన్ని ప్రాంతాల్లో వరుస భూప్రకంపనలు సంభవించిన విషయం తెలిసిందే. ఆ ఘటన నుంచి తేరుకోక ముందే.. మళ్లీ భూకంప సంభవించింది.
ఇండోనేషియాలోని తలాడ్ దీవుల్లో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 2.18 గంటలకు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైంది. ఈ భూకంపాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) ధృవీకరించింది.
జపాన్ లో ఇటీవల వరుస భూకంపాలు(Japan Earthquake) సృష్టించిన వినాశనం తెలిసిందే. రిక్టర్ స్కేల్ పై 7.6 తీవ్రతతో ఒకే రోజు సుమారు 155 ప్రాంతాల్లో వరుస భూకంపాలు భయాందోళనలకు గురి చేశాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.