Home » Jharkhand
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ బుధవారం సాయంత్రం ముగిసింది. దీనితోపాటు కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానానికి... దేశంలోని మొత్తం 10 రాష్ట్రాల్లోని మొత్తం 31 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు ఉప ఎన్నిక జరిగింది.
కాంగ్రెస్, ఆర్జేడీ, జేఎంఎం చాలాకాలంగా ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నాయని, అయినప్పటికీ సంథాల్ పరగణకు వారు ఇచ్చినది కేవలం వలసలు, పేదరికం, నిరుద్యోగమేనని ప్రధాని మోదీ విమర్శించారు. ముఖ్యమంత్రి స్వయంగా ఈ ప్రాంతం నుంచే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, కానీ ప్రజలు మాత్రం పనుల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయారని అన్నారు.
Elections: దేశంలో మరో కీలక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆల్రెడీ పోలింగ్ కూడా మొదలైపోయింది. దీంతో అక్కడి ఓటర్లు ఏ పార్టీకి అధికారం కట్టబెడతారనేది ఆసక్తికరంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా 15, 344 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, 200 కంపెనీల భద్రతా బలగాలను మోహరించారు. తొలి విడతలో భాగంగా 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగనుండగా, వీటిలో 17 జనరల్ సీట్లు, 20 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు, ఆరు ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి.
వక్ఫ్ బోర్డులో మార్పులను తాము వ్యతిరేకిస్తున్నట్టు జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెబుతున్నారని, అయితే వాళ్లు ఎన్ని చెప్పినా వక్ఫ్ చట్టానికి సవరణలు తెచ్చే బిల్లును బీజేపీ ఆమోదిస్తుందని, దానిని ఎవరూ ఆపలేరని అమిత్షా స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నేత అలంఘీర్ అలమ్ ఇంట్లో రూ.30 కోట్లకు పైగా పట్టుబడిన విషయాన్ని అమిత్షా ప్రస్తావిస్తూ, 27 కౌంటింగ్ మిషన్లతో పట్టుబడిన సొమ్మును లెక్కించారని, ఈ డబ్బంతా ఎక్కడదని ప్రశ్నించారు. ఇదంతా జార్ఖాండ్ ప్రజలకు మోదీ పంపిన సొమ్మని, దానిని హేమంత్ సోరెన్ ప్రభుత్వం హస్తగతం చేసుకుందని చెప్పారు.
కాంగ్రెస్-జేఎంఎం కూటమి ఓబీసీల ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని చేస్తోందని, ఉపకులాలను ఉసిగొలుపుతోందని మోదీ ఆరోపించారు. ఛోటానగర్ ప్రాంతంలో 125 ఓబీసీ ఉప కులాలు ఉన్నాయని మోదీ అన్నారు. అంతా కలిసి ఉంటేనే అందరికీ క్షేమమని అన్నారు
రాజ్యాంగంపై బీజేపీ నిరంతర దాడి చేస్తోందని, అయితే ఇండియా-కూటమి నిరంతరం రాజ్యాంగ పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తోందని చెప్పారు. రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని తొలగించేందుకు తామ (కాంగ్రెస్) కట్టుబడి ఉంటామని రాహుల్ చెప్పారు.
ఈ నెల 13, 20 తేదీల్లో.. రెండు దశల్లో జరగనున్న ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆదివాసీ, మహిళా ఓటర్లే ఫలితాల్ని నిర్ణయించనున్నారు.
ఎన్నికల్లో ఎందుకు తమ పార్టీకి ఓటు వేయాలనేది ప్రజలకు ఆయా పార్టీలు వివరించాల్సి ఉంటుందని, తమ కూటమి ప్రధానంగా 7 గ్యారెంటీలతో ప్రజల ముందుకు వస్తోందని, ఈ ఎన్నికల్లో తాము అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని ఖర్గే, హేమంత్ సోరెన్ తెలిపారు.