Home » Jharkhand
2019 నామినేషన్లో ఆయన తన వయస్సును 42 ఏళ్లుగా చెప్పుకోగా, ఈ ఏడాది దాఖలు చేసిన అఫిడవిట్లో 49 ఏళ్లుగా డిక్లేర్ చేయడం పలు ప్రశ్నలకు , విమర్శలకు దారితీసింది. దీనిపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది.
జార్ఖండ్, మహారాష్ట్ర, అసెంబ్లీ ఎన్నికలు, పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమిలో చిచ్చురేగింది. కాంగ్రెస్ ఏకపక్ష వైఖరి వామపక్షాలను ఆగ్రహానికి గురిచేస్తోంది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, మహారాష్ట్రలో ప్రచారానికి రావాల్సిందిగా శివసేన-యూబీటీ, ఎన్సీపీ-ఎస్పీ నేతలు అరవింద్ కేజ్రీవాల్‌ను ఇటీవల కోరారు. ఇందుకు సానుకూలంగా కేజ్రీవాల్ స్పందించారు. ఆప్ కార్యకర్తలు ఉన్న ప్రాంతాల్లోనూ, వివాద రహిత అభ్యర్థులు ఉన్న చోట్ల ప్రచారానికి ఆయన అంగీకరించారు.
బర్హైత్ (ఎస్టీ) నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా హేమంత్ సోరెన్ ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఆయన బీజేపీ అభ్యర్థి సైమాన్ మాల్టేపై 25,740 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. గాండేయ్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కల్పనా సోరెన్ బీజేపీ అభ్యర్థి దిలీప్ కుమార్ వర్మపై 27,149 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడు భట్టి విక్రమార్క.. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలైన ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), ఆర్జేడీలతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
బీజేపీ తొలి జాబితాలో చోటుచేసుకున్న ప్రముఖుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ, జెఎంఎం నుంచి కమలం గూటిలోకి చేరిన మాజీ ముఖ్యమంత్రి చంపయి సోరెన్, సీతా సోరెన్ తదితరులు ఉన్నారు.
అనురాగ్ గుప్తా స్థానంలో కొత్త డీజీపీ నియామకానికి వీలుగా సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారుల జాబితాను అక్టోబర్ 21వ తేదీలోగా తమకు సమర్పించాలని కూడా జార్ఖాండ్ ప్రభుత్వాన్ని ఈసీఐ ఆదేశించింది.
జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఇండియా' కూటమి కలిసికట్టుగా పోటీ చేస్తుందని జేఎంఎం అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శనివారంనాడు ప్రకటించారు.
జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్డీయేకు ఊహించని దెబ్బ తగిలింది. ఎన్డీయే భాగస్వామిగా ఉన్న ఆల్ జార్ఖాండ్ స్టూడెంట్స్ యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షుడు ఉమాకాంత్ రజక్, బీజేపీ హ్రాట్రిక్ ఎమ్మెల్యే కేదార్ హజ్రాలు జార్ఖాండ్ ముక్తి మోర్చాలో చేరారు.
దేశ రాజధాని ఢిల్లీతోపాటు, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరణ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.