Home » JNTU
జేఎన్టీయూకే, సెప్టెంబరు 13: విద్యార్థులు దైర్యంగా ప్రతిసవాళ్లను ఎదుర్కోవాలని జేఎన్టీయూకే ఇన్చార్జి ఉపకులపతి కేవీఎస్‌జీ.మురళీకృష్ణ అన్నారు. వర్శిటీలోని సెనేట్ హాల్లో ఐఐఎఫ్‌టీ కాకినాడ ఐపీఎం 2024-29 బ్యాచ్ కోసం నిర్వహించిన ఓరియంటేషన్ వారం ముగింపు వేడుక శుక్రవారం ఘనంగా జరిగింది.
జేఎన్టీయూ(JNTU)కు అనుబంధంగా ఉన్న ఎనిమిది ఇంజనీరింగ్ కాలేజీల్లో కౌన్సెలింగ్ అనంతరం మిగిలిపోయిన సుమారు 800కు పైగా సీట్లను స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీకై రిజిస్ట్రార్ గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు.
అధ్యాపకులు నిత్య పరిశోధకులుగా కొత్త అంశాలను ఎప్పటికప్పుడు శోధించాలని జేఎనటీయూ ఇనచార్జి వీసీ ప్రొఫెసర్ సుదర్శన రావు సూచించారు. బుధవారం జేఎనటీయూ ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ సెమినార్ హాల్లో ఫ్యాకల్టీ డెవల్‌పమెంట్ ప్రోగ్రాం(ఎ్‌ఫడీపీ) నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చెన్నారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఎఫ్డీపీకి వీసీ సుదర్శనరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జేఎన్టీయూ కాలేజీలో ఇంజనీరింగ్ సీటంటే ఏ విద్యార్థైనా ఎగిరి గంతేస్తాడు. కానీ, ఖమ్మం జిల్లా పాలేరు, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జేఎన్టీయూ కాలేజీల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.
జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్ల హవా సాగుతోంది.
జేఎన్టీయూలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ జోరు పెరిగింది. ప్లేస్‌మెంట్స్(Placements) పొందిన విద్యార్థుల సగటు వార్షిక వేతనం గత రెండేళ్లలో రెట్టింపైంది. తాజాగా విడుదలైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ఇంజనీరింగ్ విభాగంలో జేఎన్టీయూకు ఇచ్చిన స్కోరే ఇందుకు నిదర్శనం.
కంప్యూటర్ సైన్స్, అనుబంధ కోర్సుల్లో బోధనకు ఇంజనీరింగ్ ఇతర బ్రాంచ్‌ల ప్రొఫెసర్లు కూడా అర్హులేనని జేఎన్టీయూ స్పష్టం చేసింది.
ఎప్‌సెట్ మూడోదశ కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు పూర్తయిన నేపథ్యంలో ఇంజనీరింగ్ అకడమిక్ క్యాలండర్‌ను జేఎన్టీయూ అధికారులు సోమవారం విడుదల చేశారు.
కొత్త కోర్సుల ప్రారంభం, డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచుకోవడం, లేదంటే తగ్గించడం, కోర్సుల విలీనం వంటి అంశాల్లో విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వానిదే తుది నిర్ణయమని హైకోర్టు స్పష్టం చేసింది.
చేతిలో ఫైళ్లు, వాటిలో తమ విద్యాభ్యాసానికి సంబంధించిన బోలెడన్ని సర్టిఫికెట్లతో అడ్మిషన్ల కౌన్సెలింగ్‌కు విద్యార్థులు వెళ్తుంటారు. అయితే త్వరలోనే ఈ తరహా (ఫిజికల్ సర్టిఫికెట్ల) విధానానికి స్వస్తి పలికేందుకు జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) సిద్ధమవుతోంది.