Home » JNTU
జేఎన్టీయూ(JNTU)లో రిజిస్ట్రార్‌కు, ఉన్నతాధికారులకు మధ్య కోల్డ్‌వార్ నడుస్తోందా.. అంటే అవుననే అంటున్నారు పలువురు ఉద్యోగులు. తమ విభాగాల నుంచి ముఖ్యమైన ఫైళ్లు రిజిస్ట్రార్‌కు పంపినా, వాటిని క్లియర్ చేయకుండా తన వద్దనే అట్టిపెట్టుకుంటున్నారని కొందరు డైరెక్టర్లు రిజిస్ట్రార్ తీరును ఆక్షేపిస్తున్నారు.
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా మలచడంలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ(JNTU Engineering College) మరో ముందడుగు వేసింది. ప్రత్యేకించి బ్యాంకింగ్ రంగానికి ఇంజనీరింగ్ నిపుణులను అందించేందుకు ఈ ఏడాది నుంచి బీటెక్‌తో పాటు ఒక మైనర్‌డిగ్రీని ప్రవేశపెడుతోంది.
వైసీపీ ప్రభుత్వంలో వర్సిటీల అభివృద్ధిని అటకెక్కించారు. మౌలిక సదుపాయాల కల్పనను విస్మరించారు. పైగా.. అంతకు మునుపు టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని తామే చేసినట్లుగా చూపించుకున్నారు. ఇందుకు నిదర్శనం.. అనంతపురం జేఎనటీయూలో అధునాతన భవనాల నిర్మాణం. 2014-19లో టీడీపీ ప్రభుత్వం అనంతపురం జేఎనటీయూలో రూ.120 కోట్లతో అధునాతన భవన నిర్మాణ పనులను చేపట్టింది. 2017 ఏప్రిల్ 20న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వర్చువల్‌గా...
వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం సాయంకాలం(ఈవెనింగ్) బీటెక్ (పార్ట్‌టైమ్) ప్రోగ్రామ్ నిర్వహించేందుకు జేఎన్టీయూ(JNTU) సన్నద్ధమైంది. ఈ విద్యా సంవత్సరం (2024-25)లోనే ప్రవేశాలు కల్పించేందుకు వర్సిటీ ఉన్నతాధికారులు మార్గదర్శకాలను సిద్ధం చేశారు. నాలుగైదురోజుల్లో నోటిఫికేషన్(Notification) విడుదల చేసి, ఆగస్టు 15లోపు అడ్మిషన్ల ప్రక్రియను పూర్తిచే యాలని భావిస్తున్నారు.