Home » KADAPA
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులకు సంబంధించిన కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి బండి రాఘవరెడ్డి దాఖలు చేసుకున్న ముందుస్తు బెయిల్ పిటిషన్‌ను గురువారం కడప జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు (4వ అదనపు జిల్లా కోర్టు) కొట్టివేసింది.
కడప జిల్లా: తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి.. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గాల మధ్య చర్చలు కొలిక్కిరాలేదు. ఆర్టీపీపీ దగ్గర, అనంతపురం కడప జిల్లాల బోర్డర్ చెక్ పోస్టుల దగ్గర పోలీసు బలగాల పికేటింగ్ కొనసాగుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన లారీలు తాడిపత్రి నుండి వచ్చిఆర్టీపీపీ దగ్గర ఆగిపోయాయి. రెండు రోజుల క్రితం ప్లైయాష్ కోసం వచ్చి వాహనాలు ఆగిపోయాయి.
ఆర్టీపీపీ నుంచి ఫ్లైయాస్ పౌడర్ తాడిపత్రికి తరలించే విషయంలో జేసీ బ్రదర్స్.. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. ఆ చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. అటు తాడిపత్రి నుంచి జేసీ వర్గీయులు మళ్లీ వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా పోలీసు బలగాలు మొహరించాయి.
మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కడప. ఐదేళ్లు ఆయన అధికారంలో ఉండడంతో ఈ జిల్లా అభివృద్ధిలో పరుగులు పెట్టి ఉంటుందనేది... ఇతర జిల్లా వాసులు భావన..! కానీ.. సొంత జిల్లా అభివృద్ధికి జగన్ చేసింది అంతంతమాత్రమే.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ నేత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి.
వైసీపీ సోషల్ మీడియా కడప జిల్లా కో-కన్వీనర్ వర్రా రవీంద్రరెడ్డి జ్యుడీషియల్ రిమాండ్‌ను న్యాయస్థానం మరో 14 రోజులు పొడిగించింది.
ప్రభుత్వంలో ఏదైనా బిల్లు పాస్ అయి చెల్లింపులు జరగాలంటే పరిపాలనాపరమైన అనుమతులు ఉండి తీరాల్సిందే! హెచ్ఓడీ, సచివాలయ శాఖ, బడ్జెట్ రిలీజ్ ఆర్డర్(బీఆర్వో)లో పేర్కొన్న నిబంధనల ప్రకారం బిల్లుకు ఆమోదం ...
యావత్ భారతదేశంలో జనగణనతో పాటుగా ఓబీసీ కులగణన త్వరగా పాలక ప్రభుత్వాలు చేపట్టాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.
పులివెందుల పట్టణం కడప రోడ్డులోని మెడికల్ కళాశాల సమీపంలో కోడిగుడ్ల బొలెరో వాహనాన్ని రేషన్ బియ్యం లారీ ఆదివారం రాత్రి ఢీకొంది. ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవరు ప్రసాద్ తలకు గాయాలయ్యాయి.
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై అరెస్టులు కొనసాగుతున్నాయి. కూటమి పెద్దలు, సీఎం, డిప్యూటీ సీఎం, లోకేష్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ వ్యహారాన్ని కూటమి సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. అసభ్యంగా పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.