Home » KADAPA
పసుపు సాగులో రైతులు కొత్తపద్ధతులు అవలంభిస్తున్నారు. పసుపుతో పాటు అంతర పంటగా బొప్పాయి సాగు చేపడుతు న్నారు. డ్రిప్ ఏర్పాటు చేసి నీటి తడులు అందించ డంతో తోటలు ఏపుగా పెరిగి కళకళలాడుతున్నాయి.
వైసీపీ కంచుకోటగా ఉన్న కడప గడ్డపై టీడీపీ జెండాను రెపరెపలాడించిన కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిపై ఎవరైనా నోరు జారితే సహించేది లేదని ఆ పార్టీ కార్పొరేటర్లు హెచ్చరించారు.
ఆంధ్రా ఊటీగా గుర్తింపు ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ అభివృద్ధి అటకెక్కినట్లే కనిపిస్తోంది. టూరిజం రంగాన్ని ఉరకలెత్తించి తద్వారా ఆదాయ మార్గాలను పెంచుకోవాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు జిల్లా ఉన్నతాధికారులు తమ వంతు ప్రయత్నాలను తీవ్రంగా చేశారు.
ములకలచెరువు మార్కెట్‌కు టమోటాలు గతంలో ఎన్నడూ లేనంతగా భారీ స్థాయిలో అమ్మకానికి వస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు తోటల్లోని టమోటాలు కోయడానికి వీలు కాలేదు. వర్షాలు కాస్త తగ్గడంతో రైతులు కోతలు కోస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాయచోటి పట్టణంలో కురిసిన భారీ వర్షం ప్రజల్లో తీవ్ర విషాదం నింపింది. నిన్న(శుక్రవారం) రాత్రి కురుసిన భారీ వర్షానికి ఎస్ఎన్ కాలనీ అంగన్‌వాడీ వెనుక ఉన్న డ్రైనేజీ కాలువ వరద నీటితో ఉధృతంగా ప్రవహించింది.
కడప జిల్లా కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్‌లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో కొత్త పరిశ్రమలు పెరుగుతున్నాయి. కడప జిల్లాలోని నిరోద్యోగులకు ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా కడప మహిళలకు విశేష అవకాశాలు లభిస్తున్నాయి.
కోళ్ల ఫారాల నిర్వాహకులు నిబంధనలు పాటించకపోతే ఫారాలను సీజ్ చేస్తామని తహసీల్దార్ తపశ్విని, ఎంపీడీఓ రమేష్ హెచ్చరించారు. గురువారం రెడ్డివారిపల్లి పంచాయతీ పిట్టావాండ్లపల్లి వద్ద నున్న కోళ్ల ఫారాలను తనిఖీ చేసిన వారు మాట్లాడుతూ కోళ్ల ఫారాల వ్యర్థాలు, చనిపోయి న కోళ్ల ద్వారా ఈగలు ప్రబలకుండా బాయిలర్ చేసి వాసన రాకుండా శానిటేషన్ చేయాలని తెలిపారు.
స్థానిక జడ్పీ హైస్కూల్ విద్యార్థులు అన్నింటా విజేతలై నిలిచి సత్తాచాటారు. గురువారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధ్వర్యంలో జరిగిన మండల స్థాయి వాలీబాల్, ఖోఖో పోటీలు పోటాపోటీగా సాగాయి.
రైతన్నలు పంటలకు సేంద్రియ ఎరువు లు వాడేలా ప్రణాళిక సిద్దం చేసుకోవాలని జిల్లా వ్యవసా యాధికారి శివనారాయణ పేర్కొన్నారు. తరిగొండలో యూరియా వాడకంపై రైతు లకు ఆయన అవగాహన క ల్పించారు. పంటలకు సేంద్రి య ఎరువులు వినియోగిం చాలన్నారు. రైతులు ప్రకృతి వ్యవసా యంపై మొగ్గు చూపాలన్నారు. ఇందు కు పచ్చిరొట్ట ఎరువులు, జనుము, జీలు గ వాడాలన్నారు.
మండల రైతులు నానో(లిక్విడ్) యూరియా వాడితే అధిక దిగుబడులు సాధ్యమని మండల ప్రత్యేక అధికారి సతీష్‌కుమార్ సూచించారు.