Home » KADAPA
పెరిగిన సాంకేతిక విప్లవంలో దండోరా కాలగర్భంలో కలిసిపోయింది. దండోరా వేయడం అంతరించిపోవడంతో వాటిపై ఆధారపడ్డ కుటుం బాలు ప్రత్యామ్నాయ ఉపాధి వైపు మళ్లాయి.
ఒకరినొకరు వదలలేని ప్రేమాను రాగాలు.. ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లడం. 62 ఏళ్ల అన్యోన్య దాంపత్యం. అలాంటి దంపతులను వృద్ధాప్య సమస్యలు వెంటా డాయి. ఇలాంటి సమస్యలతో నిత్యం బాధపడుతూ బిడ్డలకు భారం కాకూడద ని నిశ్చయించుకున్నారు.
ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాకాలు పంట కింద సాగు చేసిన బెండ అన్నదాతలకు సిరులు కురిపిస్తోంది. ఆశించిన దిగుబడులతో పాటు, మార్కెట్‌లో మంచి ధరలు పలుకుతుంటడంతో రైతులు ఆనందంలో ఉన్నారు. సిద్ధవటం మండలంలోని ఖాజీపల్లి టక్కోలి, కాకిపల్లె, డేగలవాండ్లపల్లె, పాత టక్కొలు, మంగళవాండ్లపల్లె, కడపాయల్లి, లింగంపల్లె, మాచుపల్లె, తురకపల్లె, మూలవల్లె తదితర గ్రామాలు కూరగాయల పంటల సాగుకు ప్రసిద్ది. పలు రకాల కూరగాయలను ఇక్కడి రైతులు పండిస్తుంటారు.
మండలంలోని టీకోడూరు గ్రామం సమీపంలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న మెగా సోలార్ పవర్‌ప్లాంట్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. 300 మెగావాట్ల సామర్థ్యంతో 1500 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ మెగా సోలార్‌పవర్ ప్లాంట్ పనులు చకచకా జరుగుతున్నాయి.
మొక్క లను పెంచండి, చెట్లను రక్షించి పర్యావరణాన్ని కాపాడాలని ఓ వైపున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెవిలో జోరీగలా ఊదరగొడుతున్నా, అవగాహన సదస్సులు, ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నా వ్యాపారులు వృక్షాలను ఇష్టానుసారంగా నరికేస్తు న్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నా యి.
కోసువారిపల్లెలో కొలువైన ప్రసన్న వేంకట రమణ స్వామి ఆలయ వార్షిక పవిత్రోత్సవాల్లో మూడో రోజు టీటీడీ ఆధ్వర్యంలో పవి త్రాల సమర్పణ వేడుకగా నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి అభిషేకం, ధూపదీప నైవేద్యాలు పూర్తిచేశారు.
ఖరీ ఫ్ సీజన్, వర్షాలు కురుస్తుండడంతో, వరి, వేరుశనగ, ఇతర పంటలకు అదును కావడంతో రైతు లు వరి నాట్లు వేశారు. కొన్ని ప్రాంతాల్లో వరి సాగు చేసి నెల రోజులు, మరికొన్ని చోట్ల 20 రో జులు దాటుతున్నా ఇప్పటికీ రైతులు యూరియా వేయలేదు. నాట్లు వేసిన 15 రోజులకే యూరి యా చల్లాల్సి ఉండగా అవసరం మేరకు యూరి యా దొరకడంలేదు. దీంతో యూరియా కోసం రైతులు నానా తంటాలు పడుతున్నారు.
యువనేత, మంత్రి నారా లోకేశ్ టీడీపీకి భవిష్యత్తు ఆశాకిరణం. అలాంటి నేత మంగళవారం కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నవారు తమకు లోకేశ్ భరోసా ఇస్తారని ఆశిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంతో కొప్పర్తికి మహర్దశ పడుతోంది. జగన్ హయాంలో కనీసం సొంత జిల్లాను కూడా అభివృద్ధి చేసుకోలేదు.. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి కడప అభివృద్ధిలో తన మార్కు చూపించారు.
పేదలకు సొంతింటి కల నెరవేర్చాలనే ప్రభుత్వ లక్ష్యం హౌసింగ్ శాఖలోని అవినీతి అధికారుల వల్ల నీరుకారుతోంది. హౌసింగ్ శాఖలో రోజుకు ఒక అవినీతి భాగోతం బట్టబయలు అవుతోంది. పేదల ఇంటి నిర్మాణం కోసం ఇచ్చే సిమెంటు, స్టీలును హౌసింగ్ శాఖలోని వారే అడ్డంగా బొక్కుతున్నారు.