Home » Kaleshwaram Project
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ గురిపెట్టింది. రిజర్వాయర్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదు మేరకు సోమవారం విజిలెన్స్ అధికారులు జలసౌధలో సోదాలు నిర్వహించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి గల కారణాలపై తుది నివేదిక అందించడానికి వీలుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కసరత్తును ముమ్మరం చేసింది.
కాళేశ్వరం ఎత్తిపోతలలో రూ.లక్ష కోట్లు వెచ్చించినా.. ఆ ప్రాజెక్టు వైఫల్యం ప్రజల కళ్లముందు ఉందని.. వెరసి పదేళ్లలో రాష్ట్రం రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు.
‘‘బ్యారేజీలు నీటి మళ్లింపు కోసమే కట్టాలి. కానీ, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేస్తే తప్ప మోటార్లు అన్నీ నడిపే పరిస్థితుల్లేవు.
‘కాళేశ్వరం ఎవరి మానస పుత్రిక (బ్రెయిన్ చైల్డ్)నో తెలియకుండానే పదవులు అనుభవించారా? అలాగైతే మీరు రాజీనామా చేయాల్సి ఉంటుంది. వాస్తవాలు చెప్పకుండా కొందరిని రక్షించే యత్నం చేస్తున్నారా?
కొత్తగా వచ్చే ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ వంటి వారినే ఆదర్శంగా తీసుకోవాలని, కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లను కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు.
‘‘నీటి పారుదల శాఖలో 50 శాతానికిపైగా కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన ఇంజనీర్లే ఉన్నారు. వాళ్లందరిపై చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంటే ఉండదు.
బీఆర్ఎస్ హయాంలో రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా.. అది కళ్ల ముందే కూలిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జలసౌధలో ఏఈఈలకు ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమం, దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్‌ను ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి గురువారం పాల్గొన్నారు.
‘‘కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్‌ను.. కేవలం రుణాలు తీసుకొని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికే ఏర్పాటు చేశారా? కార్పొరేషన్‌కు ఆస్తులున్నాయా? ఆదాయం ఏమైనా ఉందా?
కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ మళ్లీ మంగళవారం నుంచి జరగనుంది. ఈరోజు కమిషన్ ఎదుట విచారణకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఇంజనీర్లు హాజరుకానున్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు బహిరంగ విచారణ కొనసాగనుంది. 45 మంది ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, అకౌంట్స్ అధికారులను కమిషన్ విచారించనుంది.