Home » Kaleshwaram Project
Telangana: కాళేశ్వరం లిఫ్టుల్లో అవినీతి, అక్రమాలు, నాణ్యతా లోపాలపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు జస్టిస్ పీసీ చంద్రఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుకు కారణం రాఫ్ట్ కింద పలు సమస్యల వల్ల జరిగింది అన్నట్లు మిషన్ ముందు ఇంజనీర్లు చెప్పారు. సిఖెండ్ ఫైల్స్, అలాట్మెంట్ డివియేషన్ వల్ల సమస్య వచ్చింది అన్నట్లు ఇంజనీర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. డిజైన్ల అప్రూవల్ తర్వాత అన్నారం గ్యారేజీ మోడిఫికేషన్ జరిగిందని కమిషన్‌ముందు ఇంజనీర్ ఒప్పుకున్నారు.
కృష్ణా, భీమా నది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి మళ్లీ వరద పెరుగుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి సోమవారం 1,32,324 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 1,30,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిళ్ల బ్యారేజీ కట్టిన స్థలాన్ని తాము పరిశీలించలేదని, కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ (సీఈ) నల్లా వెంకటేశ్వర్లు ఇచ్చిన సమగ్ర సమాచారం ఆధారంగా డిజైన్లు సిద్ధం చేశామని నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) మాజీ ఎస్ఈ మహ్మద్ అబ్దుల్ ఫజల్ తెలిపారు.
కాళేశ్వరం బ్యారేజీల డిజైన్లు/డ్రాయింగ్లు సంపూర్ణంగా అధ్యయనం చేసే అవకాశాన్ని అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావులు తమకు ఇవ్వలేదని మాజీ ఈఎన్సీ, సెంట్రల్ డి జైన్ ఆర్గనైజేషన్(సీడీవో) ఎ.నరేందర్‌రెడ్డి వెల్లడించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన బ్యారేజీల నిర్మాణం పూర్తికాకముందే.. వినియోగానికి సరిపడేంత పని జరిగిందని నిర్ధారిస్తూ సర్టిఫికెట్లు ఇవ్వడాన్ని జస్టిస్ పినాకిచంద్ర ఘోష్ కమిషన్ ప్రశ్నించింది.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విచారణకు సంబంధించిన పూర్తి నివేదికను త్వరగా అందించాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని ఆదేశించారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంలో కీలక భూమిక పోషించిన అప్పటి ప్రజాప్రతినిధులకు సమన్లు జారీ చేయాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నిర్ణయించింది.
కాళేశ్వరం లిఫ్టుల్లో అవినీతి, అక్రమాలు, నాణ్యతా లోపాలపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ వేగవంతం చేసింది. దీని కోసం కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్ శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్‌కు చేరుకున్నారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ శుక్రవారం హైదరాబాద్‌కు రానున్నారు. ఈ దఫా రెండు వారాల పాటు ఇక్కడే ఉండి, విచారణను వేగిరం చేయనున్నారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కంటే తుమ్మిడిహెట్టి బ్యారేజీ ద్వారానే తక్కువ ఖర్చుతో గోదావరి జలాలను ఎత్తిపోయవచ్చని ముందు నుంచీ వాదిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా ఆ ప్రాజెక్టును నిర్మించేందుకు అడుగులు వేస్తోంది.