Home » kaleshwaram
కాళేశ్వరం ప్రాజెక్టుపై గత కొన్నిరోజులుగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఢిల్లీ వెళ్లి అక్కడ వరుస సమీక్షలు, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు.
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. మేడిగడ్డలో జరిగిన చిన్న సంఘటనను భూతద్దంలో కాంగ్రెస్ నేతలు చూపుతున్నారని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలు దెబ్బతినడానికి గల కారణాలు తెలుసుకోవడానికి తాము సూచించిన సిఫారసుల ప్రకారం జరిగిన పరీక్షల నివేదికలు అందించాలని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్డీఎ్సఏ) ఆదేశించింది.
‘తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్ల ఖర్చయితేనే కాంగ్రెస్ గల్లీనుంచి ఢిల్లీదాకా గగ్గోలుపెట్టింది. అలాంటిది.. మూసీ సుందరీకరణకు రూ.లక్షా యాబైవేల కోట్లా?’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మూసీప్రాజెక్టుతో మురిసే రైతులెందరు? నిల్వ ఉంచే టీఎంసీలెన్ని?
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం చేసిన అప్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.9-10 వేల కోట్ల వడ్డీ కట్టాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)కు ఆమోదం లేకుండానే బ్యారేజీలపై నిర్ణయం తీసుకున్నారని విద్యుత్తు రంగ నిపుణుడు కంచర్ల రఘు చెప్పారు.
బ్యారేజీల నిర్మాణంలో ప్రమాణాలకు ఉద్దేశించిన భారతీయ ప్రమాణాల సంస్థ (ఇండియన్ స్టాండర్డ్) కోడ్-7349ను కాళేశ్వరం నిర్మాణంలో పాటించలేదని, నిర్వహణకు ఉద్దేశించిన క్లాజులను కూడా అమలు కాలేదని సంబంధిత నిపుణులు గుర్తించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణం/నిర్వహణ లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకిచంద్ర ఘోష్ కమిషన్‌కు నీటిపారుదల శాఖ అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారా?
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద వేర్వేరు ఎత్తులతో బ్యారేజీ నిర్మిస్తే కలిగే ముంపును తెలిపే సూచీ పటాలు, టోపోషీట్లు అందించాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నీటిపారుదల శాఖ అధికారులను కోరింది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జరుగుతున్న విచారణ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించింది. ఈ నెల 30వ తేదీతో గడువు ముగియనుండగా విచారణ ప్రక్రియలో పలు దశలు మిగిలి ఉండడాన్ని గుర్తించిన ప్రభుత్వం.