Home » kaleshwaram
కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు కరెంటు కొనుగోలు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ల గడువు రెండు రోజుల్లో ముగియనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నిర్మాణ లోపాలు, అవినీతిపై ప్రభుత్వం జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్ వేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ అధికారుల్లో మరోమారు గుబులు మొదలైంది. ప్రాజెక్టు నిర్మాణంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు ఇరిగేషన్ అధికారులు అఫిడవిట్ సమర్పించినట్లు తెలిసింది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరైన వారికి అఫిడవిట్ల దాఖలుకు ఇచ్చిన గడువు ఈ నెల 27వ తేదీతో ముగియనుంది.
మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాకులో చేపట్టిన తాత్కాలిక మరమ్మతు పనులు చివరి దశకు చేరుకున్నాయి. గ్రౌటింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకోగా షీట్ పైల్స్ అమరిక పనులు పూర్తికావస్తున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల విషయంలో గత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేపట్టిన తొందరపాటు చర్యలేబ్యారేజీలను దెబ్బతీశాయా? అవసరమైన సర్వేలు నిర్వహించి, నిర్ధారిత ప్రమాణాలను జాగ్రత్తగా పాటిస్తూ పదేళ్ల సమయంలో నిర్మించాల్సిన ప్రాజెక్టును కేవలం మూడేళ్ల వ్యవధిలోనే హడావుడిగా పూర్తి చేయడమే బ్యారేజీల కుంగుబాటుకు కారణమా?
లైంగిక వేధింపుల ఆరోపణలతో రెండేళ్ల క్రితం వేటు పడ్డా ఆ పోలీసు అధికారి బుద్ధి తెచ్చుకోలేదు. గతంలో పోలీసు ఉద్యోగానికి సిద్ధమవుతున్న ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడి సస్పెండైనా పద్ధతి మార్చుకోని ఆ అధికారి కొన్నాళ్లుగా సహచర ఉద్యోగినిపైనే కన్నేశాడు.
మహాదేవపూర్ మండలం కాళేశ్వరం ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న భవాని సేన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ కానిస్టేబుల్‌పై వరుసగా అత్యాచారానికి పాల్పడినట్టు సమాచారం. ఎవరికైనా ఈ విషయం చెప్తే తుపాకీతో చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారట.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి సబ్ కాంట్రాక్టర్ల వివరాలు సేకరించాలని జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ నిర్ణయించింది. ఇందుకోసం ఆయా నిర్మాణ సంస్థలకు నోటీసులు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో చోటు చేసుకున్న అవకతవకలపై కాళేశ్వరం కమిషన్ చైర్మన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ (Kaleswaram Commission Chairman Chief Justice Chandraghosh) విచారణలో వేగం పెంచారు. కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులను విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రాణహిత-చేవెళ్లలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కడితే దాదాపు 71 కిలోమీటర్ల వరకూ గ్రావిటీతో వచ్చే నీళ్లను కాదని కాళేశ్వరం ఎత్తిపోతలను ఎందుకు చేపట్టారనే అంశంపై జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ దృష్టి సారించింది.