Home » Kalvakuntla Chandrasekhar Rao
రాజకీయంగా కష్టాలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రానున్న రోజుల్లో మహర్దశ పట్టనుందని ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని జాతకం చెప్పారు. ఆయనకు త్వరలో శుభ గడియలు ప్రారంభం కానున్నాయని అన్నారు.
Telangana: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేయడం సీఎం రేవంత్ రెడ్డికి సాధ్యం కావడం లేదన్నారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకుని వచ్చారన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుల వైఫల్యంపై భూపాలపల్లి జిల్లా కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. బ్యారేజీలో జరిగిన నష్టంపై ప్రైవేటు పిటిషన్‌ను విచారించిన భూపాలపల్లి ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు తాఖీదులు జారీ చేసింది.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదా లో గురువారం తొలిసారి అసెంబ్లీకి రానున్నారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ వర్గాలు బుధవారం వెల్లడించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే.
బీఆర్ఎస్ పార్టీ అధికారిక ట్విటర్(ఎక్స్) ఖాతాలో పెట్టిన ఓ పోస్టుపై మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనుసూయ సీతక్క శుక్రవారం లీగల్ నోటీసులు పంపారు.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తన ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్తు కొనుగోళ్లు, విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణంపై ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్‌ను రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్త అవతారంలో కనిపించారు. డ్రైవర్‌గా మారి ఓమ్నీ వ్యాన్‌ను స్వయంగా నడిపారు. దాదాపు పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా, అంతకుముందు వివిధ హోదాలు...
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి రాజకీయ ‘జయోస్తు’ పలకడం కోసం పొన్నాల లక్ష్మయ్య మళ్ళీ పురాణపండ శ్రీనివాస్ చేత అపురూపమైన అద్భుత మహా నారసింహ స్వామి వారి ప్రత్యేక గ్రంధాన్ని రచింపజేయడానికి పురాణపండకు కబురు పెట్టినట్లుగా టీఆర్ఎస్ శ్రేణుల్లో వినబడుతోంది.