Home » Kalvakuntla kavitha
బీఆర్ఎస్ ఏకపక్షంగా తనను బయటకు పంపిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్లో అన్ని బాధ్యతలకు రాజీనామా చేసి మళ్లీ జనం ముందుకు వచ్చానని కవిత చెప్పుకొచ్చారు.
తన్నలకి ఎకరాకి రూ.50వేల పరిహారం, ఆడబిడ్డలకు తులం బంగారం, పింఛన్ల పెంపు ఎప్పుడిస్తారంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎమోషనల్ అయ్యారు. అమరవీరుల కుటుంబాలకు అనుకున్నంత న్యాయం చేయలేకపోయాం అంటూ..
ప్రజలు కోరుకుంటే తప్పకుండా తాను రాజకీయ పార్టీ పెడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. పార్టీ పెడితే తనకు కాదని.. ప్రజలకు మేలు జరగాలని కవిత పేర్కొన్నారు.
తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, అనిత దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు చేశారు.
ఖైరతాబాద్ చౌరస్తాలో జాగృతి నేతలతో కలిసి ధర్నా చేశారు కవిత. ఖైరతాబాద్‌లో రాస్తారోకో నిర్వహించారు. బీసీ బంద్‌లో కవిత పెద్ద కుమారుడు ఆదిత్య కూడా పాల్గొన్నారు.
బీసీ బిడ్డలు తమకు రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారని.. రిజర్వేషన్లు ఇచ్చే పార్టీలే బంద్ కు మద్దతు ప్రకటించడం నవ్వులాటగా ఉందని కవిత ఎద్దేవా చేశారు. దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీలు బంద్‌కు మద్దతు పేరుతో డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
బీసీల బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. బీసీల రిజర్వేషన్ల కోసం తాను పోరాడతానని ఉద్ఘాటించారు కవిత.
చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకొనే మనస్తత్వం తనది కాదని, అందుకే.. జాగృతి జనంబాటలో తన తండ్రి కేసీఆర్ ఫొటో పెట్టడం లేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపేర్కొన్నారు. తాను బీఆర్ఎస్లో లేను ప్రజల కోసం ఏం చేయాలన్న దానిపై తోవ వెతుక్కుంటున్నా... ‘మా దారులు వేరయ్యాయి.. అలాంటప్పుడు ఆయన ఫొటో లేకుండా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నా’ అని అన్నారు.
కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్ర చేస్తామన్నారు కవిత. కేసీఆర్ లేకుండా తెలంగాణ రాలేదని.. అయితే కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే నైతికంగా కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు.