Home » Kalvakuntla kavitha
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత ఛాలా ధైర్యంగా ఉన్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం నాడు ఆయన తీహార్ జైల్లో కవితను ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే కవితపై లిక్కర్ స్కామ్ కేసు పెట్టారని ఆరోపించారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ట్రయల్ కోర్టు రౌస్ అవెన్యూలో చుక్కెదురైన సంగతి తెలిసిందే. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. దాంతో హైకోర్టును ఆశ్రయించాలని కల్వకుంట్ల కవిత భావిస్తున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ను రౌస్ ఎవెన్యూలో గల సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం (రేపు) విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్టైన సంగతి తెలిసిందే. కవితను ఈడీ పలుమార్లు విచారించి మార్చి 15వ తేదీన అరెస్ట్ చేసింది. కవిత ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కవిత జైలులో ఉండగానే సీబీఐ అధికారులు కవితను ఈ నెల 11వ తేదీన అరెస్ట్ చేశారు.
MLC Kavitha Bail Petition: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తీహార్(Tihar) జైల్లో ఉన్న కవిత(MLC Kavitha).. మరోసారి రౌస్ అవెన్యూ కోర్టును(Rouse Avenue Court) ఆశ్రయించారు. సీబీఐ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు కవిత. ఆమె తరఫున న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో కవితకు..
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు(MLC Kavitha) మరో షాక్ తగిలింది. ఈ నెల 23 వరకు కవితకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court). లిక్కర్ స్కామ్ కేసులో కవితను మూడు రోజులు సీబీఐ కస్టడీకి అప్పగించారు. ఈ మూడు రోజుల కస్టడీ నేటితో ముగియడంతో.. ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో..
దిల్లీ మద్యం కేసులో సీబీఐ కస్టడీలో ఉన్న ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (BRS MLC Kavitha) న్యాయస్థానం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) పాత్ర ఏంటో క్షుణ్ణంగా వెల్లడించింది సీబీఐ(CBI). ఈ కుంభకోణంలో విస్తుగొలిపే మరిన్ని నిజాలను బహిర్గతం చేసింది సీబీఐ. కవితే రూ. 100 కోట్లు చెల్లించినట్లు సీబీఐ కస్టడీ రిపోర్ట్లో పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి(Sharath Chandra Reddy).. కవిత జాగృతి సంస్థకు ..
సీబీఐ అరెస్టు కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ముందు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( Kalvakuntla Kavitha ) కు మరోసారి చుక్కెదురైంది. కవితను సీబీఐ అరెస్టు చేయడాన్ని నిరాకరిస్తూ కవిత కోర్టును ఆశ్రయించారు. సీబీఐ అరెస్టుపై అత్యవసరంగా సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి మనోజ్ కుమార్ బెంచ్ ముందు అప్లికేషన్ ఫైల్ దాఖలు చేశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తిహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను జ్యుడీషియల్ కస్టడీలోనే విచారించేందుకు సీబీఐకి రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై సోమవారం తీర్పు
బళ్ళు ఓడలవుతాయి.. ఓడలు బళ్ళవుతాయి అంటే ఇదేనేమో.. తెలంగాణ ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి చూస్తుంటే ఈ సామెత గుర్తొస్తుంది. బీఆర్ఎస్ టికెట్ల కోసం విపరీతమైన పోటీ.. టికెట్ కోసం పైరవీలు.. బల నిరూపణలు.. అధినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలు.. ఒక టికెట్ కోసం పది, ఇరవై మంది పోటీ.. ఇది ఒకప్పటి బీఆర్ఎస్ పరిస్థితి.