Home » Kamal Haasan
లోక్‌సభ ఎన్నికల వేళ ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులోని అధికార డీఎంకే సారథ్యంలోని కూటమిలో కమల్ పార్టీ 'మక్కల్ నీథి మయ్యం' శనివారంనాడు చేరింది.
లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలియక మక్కల్ నీదిమయ్యం నేత కమలహాసన్(Kamala Haasan) అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో మక్కల్ నీదిమయ్యం (ఎంఎన్ఎం) డీఎంకే కూటమిలో చేరటం ఖాయమే అయినా సీట్ల పంపకంపై ఇరు పార్టీల నడుమ ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది.
ఇండియా కూటమి(INDIA Bloc)లో చేరికపై నటుడు, మక్కల్ నీధి మయ్యమ్(MNM) అధ్యక్షుడు కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఎన్ఎం 7వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన చెన్నైలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష ఇండియా కూటమిలో తన పార్టీ లేదని వెల్లడించారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఏ కూటమితో పొత్తుకుదుర్చుకోవాలనే విషయమై రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని మక్కల్ నీదిమయ్యం అధ్యక్షుడు కమలహాసన్(Kamala Haasan) తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులపై రెండ్రోజుల్లో ప్రకటన చేస్తామని ప్రముఖ నటుడు, మక్కల్ నీథి మయ్యం అధినేత కమల్ హాసన్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధత, పొత్తులపై చెన్నై విమానాశ్రయంలో మీడియాతో సోమవారంనాడు ఆయన మాట్లాడారు. ఇదొక మంచి అవకాశమని వ్యాఖ్యానించారు.
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీకి టార్చిలైట్ చిహ్నాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది.
ఏ కూటమిలో చేరినా ‘టార్చిలైట్’ చిహ్నంపైనే పోటీచేస్తామని, లేని పక్షంలో ప్రత్యేక చిహ్నంతో పోటీ చేస్తామని ‘మక్కల్ నీది మయ్యం’ (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్(Kamal Haasan) స్పష్టం చేశారు.
ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రజలు సమయం కేటాయించాలని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమలహాసన్(Kamal Haasan) పిలుపునిచ్చారు.
పార్టీకి సేవలందించడంలో బాగా వెనుకబడి, సోమరితనంతో ఉన్న నేతలపై కఠిన చర్యలు తీసుకుంటానని మక్కల్ నీదిమయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమలహాసన్(Kamala Haasan) హెచ్చరించారు.