Home » Karimnagar
గత ప్రభుత్వం నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల కక్కుర్తి వల్ల మానేరు వాగుల్లోని ఎనిమిది చెక్ డ్యాములు కృంగిపోయాయని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. గుంపుల వాగులో కృంగిన చెక్ డ్యామును ఆదివారం ఎమ్మెల్యే చింతకుంట విజ యరమణారావు పరిశీలించారు.
సీపీఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పార్టీ ఆవిర్భావ వేడు కలు ఘనంగా నిర్వహిస్తామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మె ల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం గోదావరిఖని భాస్క ర్రావుభవన్లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆర్జీ-1 బ్రాంచి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్మిక కుటుంబాల సమ్మేళ నానికి హాజరయ్యారు.
రాజీమార్గమే రాజమార్గంగా డిసెంబర్ 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని గోదావరిఖ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకాలను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ వేణు సంబంధిత అదికారులను, సెంటర్ ఇంచార్జిలను ఆదేశించారు. జూలపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి తూకాలను పరిశీలించారు.
రైతులకు సాగునీరు అందించ డమే లక్ష్యమని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. శనివారం ఓదెల మండలం మడకలో 42ఆర్ కెనాల్ నుంచి పొత్కపల్లి పరిసర ప్రాంతాలకు సాగు నీరందించడానికి, పొత్కపల్లి ఊర చెరువులోకి నీరు వెళ్ళడానికి కాల్వ తవ్వకం పనులను ప్రారంభించారు.
’మేం చదును చేసుకుంటే... మీరు మట్టి తీస్తారా‘ అంటూ పారుపల్లి పంచాయతీ పరిధి శాలగుం డ్లపల్లి రైతులు నిలదీశారు. గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పనులకు సం బంధించి మట్టి తవ్వకాల కోసం శనివారం వచ్చిన వారిని రైతులు అడ్డుకు న్నారు.
కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి పేగు బంధాన్ని మరిచిపోయింది. కన్నబిడ్డను అమ్మకానికి పెట్టింది. ఆరు లక్షల రూపాయలకు మగబిడ్డను అమ్మడానికి ప్రయత్నించింది.
కన్న బిడ్డ పట్ల తల్లి దారుణంగా ప్రవర్తించింది. పుట్టిన బిడ్డను ఎంతో అపురూపంగా చేసుకోవాల్సిన ఆ తల్లి.. ఏకంగా బిడ్డను అమ్మకానికి పెట్టేసింది.
అయిల్ పామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు వచ్చే అవకా శం ఉందని పీఏసీఎస్, ఏఎంసీ చైర్మన్లు కొత్త శ్రీని వాస్, కుడుదుల వెంకన్నలు వెల్లడించారు. అయిల్ పామ్ సాగుపై పీఏసీఎస్ కార్యాలయంలో శుక్రవారం అవగాహన సమావేశం నిర్వహించారు.
పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణి భవన్ ముట్టడికి వెళ్ళిన నాయ కులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవా రం ఓసీపీ-3 ఎస్అండ్డీ సెక్షన్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.