• Home » Karimnagar

Karimnagar

డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

దేశంలో అట్టర్‌ ప్లాప్‌ సీఎంగా రేవంత్‌ రెడ్డి నిలిచాడని, ప్రజల కష్టాల నుంచి దృష్టి మరల్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెర తీశారని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాల యంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

బయో మెడికల్‌ వ్యర్థాలను సక్రమంగా డిస్పోజల్‌ చేయాలి

బయో మెడికల్‌ వ్యర్థాలను సక్రమంగా డిస్పోజల్‌ చేయాలి

బయోమెడికల్‌ వ్యర్థా లను మున్సిపల్‌ వ్యర్థాలతో కలిపితే కఠిన చర్యలు ఉంటాయని అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ పలు ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహ కులకు సూచించారు. శుక్రవారం రామగుండం మున్సిపల్‌ పరిధి లోని ఆసుపత్రి నిర్వాహకులతో ఎన్టీపీసీలోని ఈడీసీ మిలీనియం హాల్‌లో ప్రభుత్వ, ప్రైవేటు డయాగ్నొస్టిక్‌ సెంటర్లు, డెంటల్‌ క్లినిక్స్‌, స్కాన్‌ సెంటర్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

Ponnam Calls Driver Balaraju: మంత్రి పొన్నం ఫోన్.. డ్రైవర్ బాలరాజు భావోద్వేగం

Ponnam Calls Driver Balaraju: మంత్రి పొన్నం ఫోన్.. డ్రైవర్ బాలరాజు భావోద్వేగం

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ బాలరాజుపై దాడి ఘటనకు సంబంధించి మంత్రి పొన్నం స్పందించారు. బాలరాజుతో ఫోన్లో మాట్లాడి అతడిని ఓదార్చారు. ఈ క్రమంలో మంత్రితో ఫోన్ మాట్లాడుతూ డ్రైవర్ కంటతడి పెట్టుకున్నారు.

కరీంనగర్‌ :  నగరంలో నల్లాల సర్వే

కరీంనగర్‌ : నగరంలో నల్లాల సర్వే

నగరంలో నల్లాల కనెక్షన్ల సర్వే కలకలం రేపుతోంది. అక్రమ నల్లాల క్రమబద్ధీకరణకు కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌ ఇంటింటి సర్వే జరుపాలని, పాసుబుక్‌లు లేని వారికి నోటీసులు జారీ చేసి సరైన పత్రాలను సమర్పించకుంటే సక్రమం చేసుకునేందుకు ఫీజులు వసూలు చేయాలని ఆదేశించారు.

పల్లె ఓటర్‌ జాబితాకు కసరత్తు

పల్లె ఓటర్‌ జాబితాకు కసరత్తు

పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో పల్లెల్లో హడావుడి మొదలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందడికి మరోవైపు అధికార యంత్రాంగం ఏర్పాట్ల వైపు దృష్టి పెట్టింది. డిసెంబరు 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించి సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేపట్టి అదే ఊపులో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

కార్యాలయాలన్నీ ఒకే చోట

కార్యాలయాలన్నీ ఒకే చోట

మంథని డివిజన్‌లోని ప్రజలందరికి త్వరలోనే వివిధ ప్రభుత్వ శాఖల సేవలు ఒకే చోట అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు పలు ప్రభుత్వ శాఖల్లో వివిధ పనుల నిమిత్తం రోజుల తరబడి వేర్వేరు కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగి ఇబ్బందులు పడుతున్నారు.

త్వరలో అందుబాటులోకి జిరియాట్రిక్‌ వార్డు

త్వరలో అందుబాటులోకి జిరియాట్రిక్‌ వార్డు

రామగుండం ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో జిరియాట్రిక్‌ వార్డు త్వరలో అందుబాటులోకి వస్తుందని జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ అన్నారు. వయసు పైబడిన, బెడ్‌ రిడెన్‌ పేషెంట్లకు ఈ సేవల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. సుల్తానాబాద్‌ మార్కండేయ కాలనీ వద్ద నిర్వహి స్తున్న సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్‌, జిల్లా వ్యాక్సిన్‌ స్టోర్‌ను పరిశీలించారు.

కొనుగోలు కేంద్రంలో జేసీ విచారణ

కొనుగోలు కేంద్రంలో జేసీ విచారణ

మండలంలోని కనగర్తి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో గురువారం అదనపు కలెక్టర్‌ వేణు సందర్శించారు. ఎలక్ర్టిక్‌ కాం టాలో లోపంపై విచారణ నిర్వహించారు. కాంటాపై బస్తా తూకం వేయగా తక్కువ బరువు చూపించడంతో రైతులు నష్టపో యారు.

రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న ప్రభుత్వం

రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న ప్రభుత్వం

కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నదని ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంతర్గాం, పాలకుర్తి మండ లాల్లోనే రైతాంగానికి రెండు పంటలకు నీరందించేలా ఎల్లంపల్లి వద్ద ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించానన్నారు.

గ్రంథాలయాలను అభివృద్ధి చేస్తున్నాం

గ్రంథాలయాలను అభివృద్ధి చేస్తున్నాం

పుస్తకాలే ప్రియ నేస్తాలని, విద్య అనేది గొప్ప ఆయుధమని, గత ప్రభుత్వంలో నిర్వీ ర్యమైన గ్రంథాలయ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే చిం తకుంట విజయరమణరావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో గ్రంథాలయ నూతన భవన నిర్మాణానికి డీఎంఎఫ్‌టీ ద్వారా రూ.1.50 కోట్ల నిధులతో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ అంతటి అన్నయ్యగౌడ్‌తో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి