Home » Karnataka
రాష్ట్రవ్యాప్తంగా ఫెంగల్ తుఫాను ప్రభావం తీవ్రస్థాయికి చేరింది. రాష్ట్రమంతటా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ప్రధానంగా తీరప్రాంత జిల్లాలు ఉత్తర కన్నడ, దక్షిణకన్నడ, ఉడుపి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
ఓ యువ ఐపీఎస్ కథ విషాదాంతంగా ముగిసింది. ఎన్నో ఏళ్ల కష్టానికి ప్రతిఫలం లభించే సమయంలో రోడ్డు ప్రమాదం ఆయన జీవితాన్ని తలకిందులు చేసింది. ఈ ప్రమాదంలో కర్నాటక రాష్ట్రం ఓ యువ అధికారిని కోల్పోయింది..
ప్రత్యేక రాయలసీమ సాధనకై డిసెంబరు 27న తిరుపతి(Tirupati)లో నిర్వహిస్తున్న ‘రాయలసీమ పొలికేక’ సభకు బెంగళూరు(Bengaluru)లో స్థిరపడిన ప్రవాస రాయలసీమ వాసులు తరలిరావాలని రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి(Kuncham Venkatasubba Reddy) పిలుపునిచ్చారు.
విజయనగరం(Vijayanagaram) జిల్లా హర్పనహళ్ళి పట్టణంలోని ఉపాధ్యాయుల వీధిలో ఓ ఇంట్లో పులి ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం రాత్రి 11గంటల సమయంలో చిరుతపులి(Leopard) తిరుగుతున్న దృశ్యాలు ఓ ఇంట్లోని సీసీ కెమెరా(CC camera)లో రికార్డు అయ్యాయి.
రైతులు ఐక్యమత్యంగా ఉండి తమ భూములను రక్షించుకోవాలని చంద్రశేఖరనాథ స్వామీజీ తన ప్రసంగంలో పిలుపునిచ్చారు. ముస్లింలకు ఓటు హక్కు నిరాకరించాలన్నారు. కనిపించిన భూములన్నీ తమవేనంటూ వక్ఫ్ బోర్డు లాక్కోవడం ధర్మ విరుద్ధమన్నారు.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనేలా సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ‘ముడా’ కేసులో తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టడంతోపాటు ఉప ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ ఓటమితో ఖంగు తిన్న తరుణంలోనే బలప్రదర్శనకు సిద్ధమయ్యారు.
చెన్నపట్టణ(Chennapatna) ఎన్నికల్లో ఓడిపోవడం బాధ కలిగించిందని నాకంటే నా అభిమానులు, కార్యకర్తలు మరింత నిరాశ చెందారని అలాగని కుంగిపోయేది లేదని జేడీఎస్ యువ నాయకుడు నిఖిల్(Nikhil) బహిరంగలేఖ రాశారు.
కర్ణాటక ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రూ.1750 కోట్ల బకాయిల విడుదల కోసం కేఎస్ ఆర్టీసీ ఉద్యోగులు రోడ్డెక్కనున్నారు.
చన్నపట్టణ ఎమ్మె ల్యేగా గెలిచిన ఉత్సాహంలో సీపీ యోగేశ్వర్ మాట్లాడుతున్నారని జేడీఎస్ ఎమ్మెల్యే శారదా పూర్యానాయక్(JDS MLA Sarada Pooryanayak) తిరగబడ్డారు. శివమొగ్గలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అతనెవరు.. మమ్మల్ని కొన్నారా... ఆయనను నమ్ముకుని మేం గెలవలేదన్నారు.
వాల్మీకి కార్పొరేషన్(Valmiki Corporation)లో అవినీతి ఆరోపణలతో మంత్రి పదవికి రాజీనామా చేసిన నాగేంద్ర(Nagendra)ను మళ్లీ కేబినెట్లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నాగేంద్రకు సిద్దరామయ్య కేబినెట్లో బెర్త్ దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది.