Home » KCR
బీఆర్ఎస్ (BRS) నేతలు తమపై బురద చల్లడం ఆపి ఓటమిని సమీక్షించుకోవాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) సూచించారు. అధికారం కోల్పోయి ఏడు నెలలైనా బీఆర్ఎస్ పెద్దలు ఇప్పటికీ భ్రమాలోకం నుంచి బయటకు రాలేకపోతున్నారని విమర్శించారు.
సర్కారు బడుల్లో నెలకొన్న ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తే.. అసలు సమస్యలే లేవన్నట్లుగా విద్యా శాఖ ప్రకటించడం సరికాదని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. వాస్తవాలను మరుగున పెడితే ఎలా..? అని ప్రశ్నించారు.
శాసనసభలో పూర్తి మెజార్టీ ఉండి కూడా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్‌ఎ్‌సఎల్పీలో విలీనం చేసుకున్న కేసీఆర్‌కు, బీఆర్ఎస్ నేతలకు ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఆర్‌ఎ్‌సవీ, బీజేవైఎం ఆధ్వర్యంలో వేర్వేరుగా ఆందోళనలను నిర్వహించారు. శుక్రవారం నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్పీ) కార్యాలయం వద్దకు నిరుద్యోగులు తరలివచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారిక ట్విటర్(ఎక్స్) ఖాతాలో పెట్టిన ఓ పోస్టుపై మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనుసూయ సీతక్క శుక్రవారం లీగల్ నోటీసులు పంపారు.
తెలంగాణ భవన్లో నిర్వహించిన బీఆర్ఎస్ కీలక సమావేశానికి నగరానికి చెందిన ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. మరో 15 మంది కార్పొరేటర్లూ గైర్హాజరయ్యారు.
దేశంలో రైతురాజ్యాన్ని తెచ్చుకోవాలని ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదాన్ని ఎత్తుకున్న బీఆర్ఎస్ తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోవడం పట్ల మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఆవేదన చెందారని పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు.
బీఆర్‌ఎ్‌సకు భవిష్యత్తు లేదని, ఇక ఆ పార్టీది గత చరిత్రేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం రేవంత్ మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ప్రజలు టార్చ్‌లైట్ వేసుకొని వెతుక్కుంటూ బీఆర్ఎస్ కోసం వస్తారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ స్పందించారు.
బీఆర్ఎస్(BRS) పార్టీకి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (TRVKS) షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్తో ఉన్న అనుబంధాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి ఎమ్మెల్సీ కవిత సైతం తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం దూరం అయినా ఆ పార్టీ నేతల వ్యవహార శైలి మారలేదని వివరించారు. ఇప్పటికీ ఆ పార్టీ నేతలు వాట్సాప్ యూనివర్సిటీలో జీవిస్తున్నారని మండిపడ్డారు. గతంలో సారు కారు 16 అన్నారు.. అలా అని జీరోకి వచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలంతా ఊహాల్లోంచి బయటకు రావాలని కోరారు. బయటకు వస్తే వాస్తవ పరిస్థితి ఏంటో తెలుస్తోందని సూచించారు.