Home » KCR
ఈనెల 9న సచివాలయ ఆవరణలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆహ్వానం అందింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానం అందజేశారు.
బీఆర్ఎస్ పుట్టిన తర్వాత పార్టీ ఇప్పుడే అత్యంత గడ్డుకాలాన్ని ఎదుర్కొంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత ఎన్నికల్లో తాము అధికారం మాత్రమే కోల్పోయామని, కానీ నాయకులు, కార్యకర్తల్లో పోరాట పటిమ చావలేదని ఆయన చెప్పారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆదివారం మధ్యాహ్నం 1:30గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కలవనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపున స్వయంగా ఆహ్వానించనున్నారు.
సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని, ఆమె లేనిదే ప్రత్యేక రాష్ట్రం లేదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహే్షకుమార్ గౌడ్ అన్నారు. డిసెంబరు 9న సోనియా జన్మదినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు.
భారతదేశ పాలనకు తన రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేడ్కర్ బాటలు వేశారని బీఆర్ఎస్ అధినేత, మాజీసీఎం కేసీఆర్ అన్నారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అప్పులకు అదనపు ఆదాయం కలిపి బ్యాంకులకు కట్టే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు రూ.61 వేల కోట్లు వెచ్చించామని తెలిపారు.
కేసీఆర్ హయాంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశామని వివరించారు. ఇంటిగ్రేటెడ్ పాఠాశాలలతో అన్నికూలల అభివృద్ధికి పునాదులు పడుతున్నాయని మంత్రి ఉత్తమ్ చెప్పారు.
అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత కుర్చీ ఖాళీగా ఉండడం రాష్ట్రానికి మంచిది కాదని సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు హితవు పలికారు.
హుజురాబాద్ ఏసీపీ దళితులను ఇబ్బంది పెడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ ఏసీపీ చిట్టా మొత్తం నా దగ్గర ఉందని హెచ్చరించారు. పోలీసులు బెదిరింపులకు తాము భయపడమని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు.
యువత బలిదానాలతో రాష్ట్రాన్ని సాధించుకున్నామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. లక్షలాదిమంది ఉద్యమబాట పట్టి తెలంగాణను సాధించుకున్నారని అన్నారు. టీజీపీఎస్సీని సమూల ప్రక్షాళన చేశామని చెప్పారు. యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.