Home » KCR
ప్రతిపక్షాల మాటలను నమ్మొదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. కేసీఆర్ ప్రభుత్వం బకాయి పెట్టిన రైతుబంధును తమ ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే రూ.7,625కోట్ల రైతుబంధు నిధులు చెల్లించామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
అధికారం కొల్పోయిన అనంతరం బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు అనుసరిస్తున్న వైఖరిపై మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు మండిపడ్డారు. గతంలో దీక్షా పేరుతో కేసీఆర్ ఫేక్ దీక్ష చేశారని ఆయన గుర్తు చేశారు. దీనిపై విచారణ జరపాలంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దీక్షా దివస్ ... నవంబరు 29న బీఆర్ఎస్ జరుపుకునే దీక్షా దివస్ మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని కీలక మలుపుతిప్పి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బాటలు వేసిన రోజు.. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కామెంట్స్ చేశారు.
బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్ గురుకులాల గురించి మాట్లాడితే తాను జవాబు ఇవ్వనని, వాళ్లది తన స్థాయి కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురుకులాలపై కేసీఆర్ వచ్చి మాట్లాడితే తాను సమాధానం చెబుతానన్నారు.
తెలంగాణ భవన్లో ఈనెల 29న దీక్షాదివస్ ను విజయవంతం చేయాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావుగౌడ్(Secunderabad MLA Teegulla Padmarao Goud) కార్పొరేటర్లు, ముఖ్యనాయకులకు సూచించారు.
అబద్దాల యూనివర్సిటీలో పట్టా పొందిన వ్యక్తి మాజీ మంత్రి కేటీఆర్ అని తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టుసాయి ఎద్దేవా చేశారు. దినం దినం కేటీఆర్ దిమాక్ చిన్నగా అవుతోందని విమర్శలు చేశారు.
ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మునిసిపాలిటీ పరిధిలోని మల్లన్నసాగర్ నిర్వాసిత కాలనీలో ఆయన శుక్రవారం పర్యటించారు.
కాళేశ్వరం విచారణ ప్రక్రియలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, నాటి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును తప్పనిసరిగా విచారణకు పిలిపించాలని మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై విచారణ జరుపుతున్న కమిషన్ భావిస్తోంది.
‘దాచేస్తే దాగని సత్యం.. చెరిపేస్తే చరగని చరిత్ర.. కేసీఆర్ తెలంగాణ లో సాధించిన నీలి విప్లవం’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. 2016-17లో 1.93 లక్షల టన్నుల చేపల పెంపకం నుండి 2023-24 గుకు 4.39 లక్షల టన్నులు ఎగబాకిన వైనమని అన్నారు. తెలంగాణ చేపల పెంపకంలో ఉత్తమ ‘ఇన్ ల్యాండ్ స్టేట్’ గా అవార్డు కైవసం చేసుకోవడం కేసీఆర్ విజయమని వ్యా్ఖ్యానించారు.
లగచర్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అధికారికంగా మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తముందని పేర్కొంది. ఈ కేసును ఎదుర్కొనేందుకు కేసీఆర్ రూ.10 కోట్లు విడుదల చేశారని వెల్లడించింది.