Home » KCR
రైతుల భూములను కేసీఆర్, హరీష్‌రావులు బలవంతంగా లాక్కున్నారని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. భూనిర్వాసితుల సమస్యలపైన హరీష్‌రావుతో చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. హరీష్‌రావు టైం, డేట్ ఫిక్స్ చేయాలని సవాల్ విసిరారు
ఉమ్మడి రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతాంగానికి మేలు చేసిన ఇరిగేషన్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్(ఐడీసీ)ను పదేళ్లలో కేసీఆర్ నిర్వీర్యం చేశారని ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు విమర్శించారు.
వికారాబాద్ జిల్లా దామగుండంలో వీఎల్ఎఫ్ నేవీ రేడార్ కేంద్రం ఏర్పాటుపై బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.
పౌర హక్కుల ఉద్యమ నేత, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు పౌర సమాజం కన్నీటి వీడ్కోలు పలికింది. ప్రజా సంఘాలు, పౌర హక్కుల నేతలు,
ఉద్యమం ముసుగులో మాజీ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలు, ఉద్యమకారులను తీవ్రంగా మోసం చేశారని మాజీ ఎంపీ రవీంద్రనాయక్(Ravindra Naik) ఆరోపించారు. ఆయ న బాధితులు చాలామంది ఉన్నారని, టీఆర్ఎస్ ఆవిర్భావ సభ్యుడిగా ఉన్న తనను తెలంగాణ భవన్ నుంచి బయటకు గెంటేశారని అన్నారు.
బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 5 వేలకుపైగా పాఠశాలలను మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మూసేయించారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గులో శుక్రవారం రేవంత్ పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
మానవతావాది రతన్ టాటా మృతి భారత పారిశ్రామిక రంగానికే కాకుండా సమాజ సంక్షేమాన్ని ప్రగతిని కాంక్షించే ప్రతి ఒక్కరికీ తీరని లోటని కేసీఆర్ అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించానని.. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని, కానీ.. బీఆర్ఎస్ మాత్రం తమ ప్రజా ప్రభుత్వాన్ని పడగొడతామంటోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
2016 కృష్ణా పుష్కరాల సమయంలో అలంపూర్ ఆలయాల అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయిస్తానన్న గత సీఎం కేసీఆర్ వంద రుపాయలు కూడా ఇవ్వలేదని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
ఈనాడు సంస్థల అధినేత, పద్మవిభూషణ్ గ్రహీత చెరుకూరి రామోజీరావు మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు పత్రికా, మీడియా, వ్యాపార రంగాలకు తీరని లోటని అన్నారు. అక్షర వీరుడు రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని వేడుకున్నారు.