Home » Kesineni Chinni
ఇంద్రకీలాద్రిపై ఇవాళ(శుక్రవారం) శ్రీ గాయత్రి దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. ఈరోజు అమ్మవారిని విజయవాడ ఎంపీ కేశినేని శినవాథ్ (చిన్ని) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల సందర్భంగా పోలీసులు కొండపై ఆంక్షలు విధించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నూతన పాలక వర్గం ఎన్నిక ఏకగ్రీవం కావడం శుభ పరిణామమని ఆ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో క్రికెట్ వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు.
బుడమేరు గండి పూడ్చివేత పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పరిశీలించారు. ఈ మేరకు గండి పూడ్చివేత పనులపై మంత్రి నిమ్మల, అధికారులను అడిగి నారా లోకేశ్ వివరాలు తెలుసుకున్నారు.
ఏసీఏ ఎన్నికలు మరో నెల రోజుల్లో జరుగుతాయని విజయవాడ ఎంపీ, కర్నూల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్(చిన్ని) (Kesineni Chinni) తెలిపారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల ఆఫీసర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియమించినట్లు చెప్పారు.
కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమం కోసం కృషిచేస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) (Kesineni Chinni) వ్యాఖ్యానించారు. కేవలం 40 రోజుల్లోనే అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్లు కేంద్రం అందించిందని.. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు మార్క్ అని ఉద్ఘాటించారు.
Andhrapradesh: ఎంపీ కేశినేని పుట్టిన రోజు వేడుకులను మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కేక్ కట్ చేసి వెంకన్నకు తినిపించారు. అనంతరం బుద్దా వెంకన్న మాట్లాడుతూ... పదవి లేక పోవడంతో ప్రజలకు, తనను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేకపోతున్నా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఐల ట్రాన్ఫర్స్ విషయంలో ఎమ్మెల్యేల మాట నెగ్గిందన్నారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడితో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ భేటీ అయ్యారు. రామ్మోహన్ నాయుడికి వినతిపత్రం అందజేశారు.
Andhrapradesh: ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి అయ్యేందుకు కేంద్రం భారీగా నిధులివ్వాలని ఎంపీ కేశినేని శివనాథ్ (MP Kesineni Shinath) కోరారు. సోమవారం లోక్‌సభలో రూల్ 377 కింద పొలవరం ప్రాజెక్ట్ నిధులపై ఎంపీ కేశినేని మాట్లాడారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం తగిన నిధులు విడుదల చేయాలని కోరారు. మిషన్ మోడ్ కింద పోలవరం ప్రాజెక్ట్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం...
Andhrapradesh: నందిగామ నియోజకవర్గ అధికారిక సమీక్షా సమావేశంలో విజయవాడ ఎంపీ కేసినేని శివనాద్ (చిన్ని), ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ... సమస్యలపై ఒకసారి మీ అందరితో మాట్లాడి తెలుసుకోవడమే ఈ సమావేశ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసన్నారు.
విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) అనుమతి ఇచ్చినట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(MP Kesineni Sivanath) వెల్లడించారు. రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులను కలుస్తున్నారు.