Home » Khammam News
మున్నేరు(Munneru) వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) పర్యటించారు. ఖమ్మం నగరంలోని 16వ డివిజన్ దంసాలపురం, తిరుమలాయపాలెం, రాకాసి తండాలో వరదముంపు బాధితులతో కేంద్ర మంత్రి మాట్లాడారు.
ఖమ్మంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వరద ముప్పు పెరగడంతో వరద బాధిదులు మళ్లీ బయాందోళనలకు గురువుతన్నారు. మున్నేరు మళ్లీ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఖమ్మం వద్ద మున్నేరు ప్రవాహం పెరుగుతోంది.
తెలంగాణలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో కుండపోతగా వానలు కురుస్తుండటంతో మున్నేరు వారు పొంగి ఉధృతంగా ప్రవహించింది. దీంతో లోతట్టు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద బాధితులను ఆదుకోవడానికి బీజేపీ పార్టీ ముందుకు వచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు.
ప్రభుత్వం వరద బాధితులకు అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో ఈరోజు(శుక్రవారం) వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్నేరు విలయం నుంచి బాధితులు తేరుకుంటున్నారని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రహదారులపై బురదను శుభ్రం చేసే కార్యక్రమం చురుగ్గా సాగుతుందన్నారు.
సినిమా హీరోలు తెరపై అద్భుతాలు చేస్తుంటారు. ఒంటి చేత్తో పోరాడి వందల మందిని అవలీలగా కాపాడేస్తుంటారు. నిజ జీవితంలో ఇలాంటివి జరగవు కానీ.. కొందరు తమ ధైర్య సాహసాలతో రియల్ హీరోలుగా నిలుస్తుంటారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా మున్నేరు వరదల్లో ప్రకాశ్నగ్ బ్రిడ్జిపై చిక్కుకున్న 9మందిని బయటికి తీసుకురాలేకపోయారని బీఆర్ఎస్ ఎమ్మల్యే హరీశ్రావు విమర్శించారు.
భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు మంగళవారం పర్యటించారు. బాధిత ప్రజలు, రైతులను ఆదుకుంటామని ధైర్యం చెప్పారు. పంట నష్టం అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఎగిరిపోయిన పైకప్పులు, కూలిన గోడలు, కొట్టుకుపోయిన ఇళ్లు..! ఖమ్మంలో మున్నేరు విలయంతో ఎటుచూసినా విషాద గాథలే..! ఏ వీధిలో తిరగాలన్నా అంతా బురదే..!
తెలంగాణలో నాలుగు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వానలతో ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. కాలనీల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.