Home » Khammam
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు కడితే, రాష్ట్ర విభజన తరువాత పది సంవత్సరాల పాలనలో ఉన్న బీఆర్ఎస్, తెలంగాణలో హౌసింగ్ డిపార్ట్మెంట్ అనేదే లేకుండా చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.
రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. పంపిణీ కేంద్రాలు, దుకాణాల ముందు రేయింబవళ్లు బారులు తీరి పడిగాపులు కాస్తున్నారు.
బీటీపీఎస్ పరిసర ప్రాంతాల్లోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరలో ఫ్లైయాష్ బ్రిక్స్‌ను అందిచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు మండలంలోని బీటీపీఎస్ కర్మాగారానికి చెందిన ఫ్లై యాష్ పాండ్‌ను కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం పరిశీలించారు.
నిద్రలో ఉన్న తల్లీకూతుళ్లను పాము కాటేయడంతో చిన్నారి మృతి చెందగా.. తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
మద్యం తాగి తరచూ వేధిస్తున్నాడని భర్తపై భార్య దాడి చేసిన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర్ గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన పర్వతం గంగరాజుకు లక్ష్మీతో 25 ఏళ్ల క్రితం వివాహమైంది.
కున్న భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి మద్యం మత్తులో దారుణానికి ఒడిగట్టాడు. తన భార్య ఆరు నెలల గర్భిణి అని కూడా చూడకుండా కత్తితో దాడి చేసి హతమార్చబోయాడు.
ఎగువన భారీ వర్షాలకు వస్తున్న వరదతో పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయం నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా.. మంగళవారం 404.60 అడుగులకు చేరింది. దీంతో రాత్రి రెండుగేట్లను ఎత్తి 10వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదలచేశారు.
పెళ్లయి అత్తారింటికి వెళ్లిపోతున్న కూతురికి అప్పగింతలు చేస్తూ తీవ్ర భావోద్వేగానికి గురై గుండెపోటుతో ఆమె తల్లి మృతిచెందింది.
బైక్ కొనివ్వలేదని ఓ కుమారుడు నిద్రలో ఉన్న తండ్రిపై గొడ్డలితో దాడి చేశాడు. ఖమ్మం జిల్లా మంగళగూడెంలో ఈ నెల 13న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
న్యూజిలాండ్ దేశానికి చెందిన ఎంటోలోమా హోచెస్టెటెరీ జాతికి చెందిన నీలి ఆకాశ పుట్టగొడుగు (స్కైబ్లూ మష్రూమ్) మన కనకగిరి అడవుల్లో మొలకెత్తింది. ఈ విషయాన్ని ఎఫ్‌డీవో వాడపల్లి మంజుల ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. సత్తుపల్లి ఫారెస్ట్ డివిజన్లోని పెనుబల్లి, కల్లూరు మండలాల్లో విస్తరించి ఉన్న కనకగిరి హిల్స్‌లోని పులిగుండాల వద్ద ఈ అరుదైన మష్రూమ్ మొలకెత్తిందన్నారు.