Home » Khammam
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యూ ఎనర్జీ పాలసీపై కసరత్తు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. త్వరలోనే రైతుల బోరు బావులకు ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు.
తెలంగాణ ప్రాంతం ఆయిల్ పామ్ సాగుకు అనువైన ప్రాంతమని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇకపై ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పామాయిల్ సాగు, విస్తరణ పెరుగుతుందని ఆయన చెప్పారు.
ప్రపంచంతో తెలంగాణ బిడ్డలు పోటీపడేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి "యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్"కు శ్రీకారం చుట్టారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమిలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు 10 వేల 6 పోస్టులు డీఎస్సీ ద్వారా ఇచ్చామని చెప్పారు. ఉపాధ్యాయుల బదిలీలతో పాటు ఉద్యోగఉన్నతి ఇందిరమ్మ ప్రభుత్వం కలిపించిందని, గత ప్రభుత్వం అనేక స్కూల్స్ పెట్టిందే తప్ప పక్క వసతి కలిపించడంలో విఫలమైందని ఆరోపించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలోని లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం 8 వ రోజు వీరలక్ష్మీ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యున్నత ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో విద్యా బోధన ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ఈ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీల పిల్లలందరూ చదువుకుంటారని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రాంతం నుంచి మరింత విరివిగా కథా సాహిత్యం రావాల్సి ఉందని ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్ కె.శ్రీనివాస్ ఆకాంక్షించారు.
అమ్మనాన్న లేకున్నా ఆసక్తితో చదివింది. అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంటూనే వైద్యురాలు కావాలనే కసితో కష్టపడి చదివి ఎంబీబీఎ్సలో సీటు సంపాదించింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల పిడుగులు పడి హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం చౌళ్లపల్లిలో ఇద్దరు మహిళా కూలీలు, భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లిలో ఓ మహిళా రైతు మృతి చెందారు.
ఖమ్మం సాగర్ కెనాల్లో పడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బాపణకుంటకు చెందిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. వీరంతా గంజాయి కేసులో బెయిల్ కోసం వెళ్లగా ప్రమాదవశాత్తూ కాలువలో పడి గల్లంతయ్యారు.