Home » Khammam
ఖమ్మం సాగర్ కెనాల్లో పడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బాపణకుంటకు చెందిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. వీరంతా గంజాయి కేసులో బెయిల్ కోసం వెళ్లగా ప్రమాదవశాత్తూ కాలువలో పడి గల్లంతయ్యారు.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మూటాపురంలో ఓ నాయకుడు తనతో పాటు తన భార్య పేరిట రెండు రేషన్ కార్డులతో రుణమాఫీ పొందిన వ్యవహారంపై విచారణ ప్రారంభమైంది.
తిరుమలకు తాను వెళ్తానంటే బీజేపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారని ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఖండించారు. వైసీపీ అధినేతను బీజేపీ నేతలు ఎవ్వరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆయన అన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు రైస్ మిల్లులపై పౌర సరఫరాల అధికారుల దాడులు కొనసాగుతున్నాయి.
ఆపరేషన్ కగార్‌లో భాగంగా భారీగా కూంబింగ్ సాగుతున్నా.. పూసుగుప్ప క్యాంప్‌పై మావోయిస్టుల దాడితో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. సుమారు అరగంట పాటు మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అయితే ప్రాణ నష్టంపై పోలీస్ అధికారులు, మావోయిస్ట్ పార్టీ ఎలాంటి అధికారక ప్రకటన చేయలేదు.
సాగర్ ఎడమ కాల్వకు పడిన గండ్లను పూడ్చడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అన్నదాతల బాధలు చూసి వారిని ఆదుకునేందుకు ఎకరాకు రూ.10వేలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.
ములుగు జిల్లా: గొల్లాల గుడిలో గుప్తనిధుల తవ్వకాలు జరిగినట్లు ఆదివారం వెలుగులోకి వచ్చింది. గుడి పైకప్పు తొలగించడంతో శిఖరం దెబ్బతింది. పైకప్పులో వికసించే తామరపువ్వు గుర్తుతో ఉన్న శిల్పాన్ని దుండగులు పూర్తిగా ధ్వంసం చేసి ఆలయ పరిసరాల్లో పడేశారు. శివలింగం ఒకవైపు ఒరిగినట్లు కనిపిస్తోంది.
విపక్ష పార్టీపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక ప్రతిపక్ష పార్టీలు తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన..
Telangana: చరిత్రలో 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 76 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ, నాటి హైదరాబాద్ సంస్థానం రాజుల పాలన నుంచి భారతదేశంలో అంతర్భాగంగా మారి ప్రజాస్వామ్య ప్రజాపాలన దశలోకి పరివర్తన చెందిందని తెలిపారు.