Home » Kishan Reddy G
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై విచారణకు గవర్నర్ అనుమతి ఇంకా రాకపోవడం వల్ల బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని సీఎం రేవంత్రెడ్డి మాట్లాడటం ఆయన స్థాయికి సరికాదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు.
అవినీతి ఎక్కడ జరిగినా విచారణ జరపాలన్నది తమ డిమాండ్ అని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం మీద సీబీఐ విచారణకు డిమాండ్ చేశామని, సీఎం రేవంత్ రెడ్డి విచారణ కోరారా.. అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు.
కేంద్రీయ విద్యాలయాలు శక్తివంతమైన మినీ ఇండియా లాంటివని, ప్రతీ పాఠశాల భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిబింబంగా నిలుస్తుందని కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి(Union Minister G. Kishan Reddy) అన్నారు. తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన రాష్ట్రీయ ఏక్తా పర్వ్ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
కాటన్ కార్పొరేషన్ ఆప్ ఇండియా (సీసీఐ) నిబంధనల కారణంగా మిల్లర్లు, రైతులు ఇబ్బందులకు గురవుతున్నారంటూ తెలంగాణ కాటన్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పత్తి కొనుగోళ్లను 4 గంటల పాటు నిలిపివేశారు.
దివంగత నాయకుడు జితేందర్ రెడ్డి తండ్రి మల్లారెడ్డి కరుడుగట్టిన జాతీయవాది అని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. వారి కుటుంబమంతా గొప్ప జాతీయ భావజాలంతో పని చేసిందని వివరించారు. పొరుగునున్న ఏపీలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ఆయన కీలక బాధ్యతలు చేపట్టారని చెప్పారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad) నగరంలో వీధిలైట్లు ఎందుకు వెలగడం లేదు.. పాడైపోయిన వాటి స్థానంలో కొత్తవాటిని బిగించడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు.. జీహెచ్ఎంసీలో ఎన్ని లైట్లు కాలిపోయాయి.. ఎన్ని వెలుగుతున్నాయో.. అసలు మీకు తెలుసా.. అని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్రెడ్డి(Union Minister Kishan Reddy) అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఆర్థికంగా దివాలా తీశాయని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జీ కిషన్రెడ్డి తెలిపారు.
‘‘అసెంబ్లీ ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన డిక్లరేషన్లు.. ఆరు గ్యారెంటీలు.. 400 హామీలు ఏమయ్యాయి..? ఎన్నికల ముందు మీరు స్వయంగా ప్రకటించిన రైతు భరోసా, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డలకు తులం బంగారం, 17 పంటలకు బోనస్ ఎప్పుడు ఇస్తారు..?
మోదీ కేబినెట్లోని మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణకు ఏం ప్రయోజనం చేకూర్చలేదన్నారు. వారిలో తెలంగాణ డీఎన్ఏ లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణకు మోదీ ప్రభుత్వం చాలా చేసిందంటూ చెబుతున్న కేంద్ర మంత్రులు ఇద్దరికీ ఈ సందర్బంగా బహిరంగ సవాల్ విసిరారు. అందుకోసం అమర వీరు స్తూపం వద్ద చర్చకు వస్తారా? అంటూ కేంద్ర మంత్రులకు ఈ సందర్భ:గా మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు.
దేశంలో 10 కోట్ల మందికిపైగా పేద వర్గాల మహిళలకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు.