Home » Kishan Reddy G
జన్వాడ ఫాంహౌ్‌సలో రేవ్ పార్టీపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫాంహౌస్ ఎవరిదైనా దర్యాప్తు జరపాల్సిందేనన్నారు.
దేశాభివృద్ధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ది కీలక పాత్ర అని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వినియోగదారులకు మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చొద్దని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుతాన్ని కోరారు. శనివారం ముషీరాబాద్‌లో వివిధ అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే ముఠాగోపాల్‌తో కలిసి కిషన్‌రెడ్డి ప్రారంభించారు.
మూసీ పరీవాహక ప్రాంతంలో ఉన్న దేవాలయాలను కూల్చే దమ్ముందా? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్ చేశారు.
Telangana: మూసీ సుందరీకరణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ విసిరిన సవాల్‌కు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో మూడు నెలలు ఉండటానికి సిద్ధమా అంటూ రేవంత్ సవాల్ విసరగా.. అందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు కిషన్ రెడ్డి ప్రకటించారు. ఇందిరాపార్క్ వద్ద జరుగుతున్న బీజేపీ మాహా ధర్నాలో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రూ.33 వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి తెలిపారు. రూ.83 వేల కోట్లతో చేపట్టనున్న 15 ప్రాజెక్టుల ‘ఫైనల్ లొకేషన్ సర్వే’ జరుగుతోందని చెప్పారు.
రేవంత్ ప్రభుత్వం సహకారం లేకపోయినా సుమారు రూ. 650 కోట్లతో వచ్చే రెండేళ్లలో ఎంఎంటీఎస్‌ను యాదాద్రి వరకు పొడిగిస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ మహా నగర ప్రజలకు, భక్తులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. సుమారు రూ.6,000 కోట్ల నిధులను ప్రస్తుత బడ్జెట్లో కేటాయించారని అన్నారు. ఇప్పటికే రూ.33వేల కోట్ల పనులు కొనసాగుతున్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు.
గడిచిన పదేళ్లలో మూసీ ప్రక్షాళన కోసం, ఆ ప్రాంత ప్రజల సంక్షేమం, ఉపాధి కోసం నయాపైసా కేటాయించని ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం ఎదుట ధర్నా చేపట్టాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని రాష్ట్ర మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
బొగ్గు అమ్మకం, కొనుగోలుదార్లకు సౌకర్యంగా ఉండేందుకు త్వరలో కేంద్ర ప్రభుత్వం ‘కోల్ ఎక్స్ఛేంజ్’ను ఏర్పాటు చేయనుంది.
ఒక వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి హిందూ వ్యతిరేక వైఖరిని అనుసరిస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు.