Home » Kolkata
ట్రైనీ జూనియర్ డాక్టర్‌పై హత్యాచార ఘటన వెస్ట్ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బాధితురాలి కుటుంబానికి మద్దతుగా ఆర్జీ కర్ ఆసుపత్రికి చెందిన పలువురు జూనియర్ డాక్టర్లు నిరాహార దీక్ష చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా(Kolkata) జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనలో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. జూనియర్ వైద్యులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఇవాళ్టితో ఆరో రోజుకు చేరుకుంది.
జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనలో పశ్చిమబెంగాల్లోని కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
కోల్‌కతా ఆర్జీ కార్ ఆస్పత్రి, వైద్య కళాశాల ట్రెయినీ డాక్టర్ హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్(33)పై సీబీఐ కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టులో సోమవారం 45 పేజీల చార్జిషీట్ దాఖలు చేసింది.
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న ట్రైయినీ వైద్యురాలి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యాచారానికి సంజయ్ రాయ్ పాల్పడినట్లు సీబీఐ ఆరోపించింది. అందుకు సంబంధించిన అభియోగ పత్రాన్ని సోమవారం సల్దాలోని ప్రత్యేక కోర్టులో సీబీఐ దాఖలు చేసింది.
అక్టోబర్ 12వ తేదీ ఉదయం 10.58 గంటలకు వస్తుంది. ఆ మరునాడు అంటే.. అక్టోబర్ 13వ తేదీ ఉదయం వరకు ఈ దశమి ఘడియలు ఉన్నాయి. అంటే.. ఆదివారం ఉదయం 9.08 నిమిషాల వరకు ఉంది. ఈ నేపథ్యంలో దశమి ఘడియలు శనివారం ఉదయం ప్రారంభమవుతాయి.
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఈ దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారు రోజుకు ఒక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు.
ఈ ఏడాది ఆగస్ట్ 9వ తేదీన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచారం జరిగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ట్రైయినీ వైద్యురాలికి న్యాయం చేయలని.. అలాగే పని ప్రదేశాల్లో తమకు రక్షణ కల్పించాలంటూ వైద్య సిబ్బంది దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైయినీ వైద్యురాలి హత్యాచార కేసు.. అనంతరం జరిగిన చర్చల్లో తమ డిమాండ్లు నెరవేర్చడంలో మమతా బెనర్జీ ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై జూనియర్ డాక్టర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ క్రమంలో మంగళవారం వారు మరోమారు నిరవధిక ఆందోళనకు దిగారు.
హత్యాచారానికి గురైన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ట్రైయినీ వైద్యురాలి ఫొటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని సోషల్ మీడియాలో వైరల్ కాకుండా ఉండేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.