Home » Kolkata
దేశాన్ని కుదిపేస్తున్న కోల్‌కతా ఆర్జీ కర్ వైద్య కళాశాల విద్యార్థిని హత్యాచార కేసులో ఆ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మరోసారి అరెస్టు చేసింది.
బ్లాచ్మాన్ వీధి ప్రవేశమార్గం వద్ద ఒక ప్లాస్టిక్ గోనెసంచీని కనుగొన్నట్టు స్టేషన్ ఇన్చార్జి ఆఫీసర్ తెలిపారు. నిరసనలతో అట్టుడికిన ఆర్జే కర్ మెడికల్ ఆసుపత్రి వద్ద ఎవరికీ చెందని బ్యాగు ఒకటి కలకలం సృష్టించిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకుంది.
జూనియర్ వైద్యులు ప్రధానంగా 5 డిమాండ్లపై పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో మెరుగైన వైద్యసేవల కోసం తమ పని పరిస్థితులను మెరుగుపరచాలని, ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద భద్రతను పెంచాలని, హత్యాచార బాధితురాలికి న్యాయం జరగాలని, ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటనతో సంబంధం ఉన్న ఉన్నతాధికారులను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
'స్వాస్థ్య భవన్' ఎదుట నిరసన తెలుపుతున్న జూనియర్ వైద్యులపై దాడి జరిపేందుకు కుట్ర జరుగుతోందంటూ తృణమూల్ కాంగ్రెస్ నేత కునాల్ ఘోష్ సంచలన ఆరోపణ చేశారు.
సీల్దా కోర్టులో శుక్రవారం జరిగిన క్లోజ్డ్ డోర్ హియరింగ్‌లో నార్కో టెస్ట్‌కు ఏదైనా అభ్యంతరం ఉందా అని జడ్జి నేరుగా రాయ్‌ని అడిగారు. అయితే తన సమ్మతిని తెలిపేందుకు రాయ్ నిరాకరించాడు.
నేర తీవ్రత, దానిని కప్పిపుచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు, పని ప్రాంతాల్లో భయాలు నెలకొన్న వాతావరణ పరిస్థితుల్లో యావద్దేశం నిష్పాక్షికమైన సత్వర విచారణను కోరుతోందని వైద్యులు తమ లేఖలో రాష్ట్రపతి దృష్టికి తెచ్చారు.
ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటనపై జూనియర్ డాక్టర్ల నిరసనతో తలెత్తిన ప్రతిష్ఠంభన 33వ రోజైన బుధవారంనాడు కూడా తొలగలేదు. చర్చలకు రావాలంటూ ప్రభుత్వం ఆహ్వానించడాన్ని స్వాగతిస్తూనే మరిన్ని కొత్త డిమాండ్లు తెరపైకి తెచ్చారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఘటనపై వైద్యులు చేపట్టిన నిరసన బుధవారంతో 33వ రోజుకు చేరుకుంది. ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ ఇదే సమయంలో ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలు జరిగినట్టు గుర్తించి, ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్‌ను అరెస్టు చేసింది.
కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ అత్యాచారం హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో నిరసనల కంటే దుర్గాపూజ వేడుకలపై దృష్టి పెట్టాలని మమతా ప్రజలకు చేసిన విజ్ఞప్తిపై బాధితురాలి తండ్రి స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు.
కోల్‌కతాలో హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్న వైద్యులందరూ మంగళవారం సాయంత్రం 5గంటల్లోగా విధుల్లో చేరాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను జూనియర్ డాక్టర్లు పక్కన పెట్టారు.