Home » Kollu Ravindra
Andhrapradesh: ‘‘నీకు నువ్వు తిరుపతి పర్యటన రద్దు చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటు.. డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్లడానికి నీకు ఉన్న ఇబ్బంది ఏమిటి’’ అని మంత్రి కొల్లురవీంద్ర ప్రశ్నించారు.
Andhrapradesh: కలుగులో ఉన్న ఎలుకలు మళ్లీ బయటకి వచ్చాయంటూ మంత్రి కొల్లురవీంద్ర వ్యాఖ్యలు చేశారు. రవాణా శాఖ మంత్రిగా పని చేసి బందరు బస్టాండ్ అభివృద్ధి చేయలేదన్నారు. ఇప్పుడు పిచ్చి పిచ్చిగా వాగుతున్నారని.. పళ్లు రాలిపోతాయంటూ హెచ్చరించారు.
Andhrapradesh: సామాన్యుడికి అందుబాటులో ఉండేలా ఓ ప్రత్యేక బ్రాండ్‌ను తీసుకొస్తున్నామని మంత్రి కొల్లురవీంద్ర అన్నారు. టూరిజం పాలసీలో 3, 4 నక్షత్రాల హోటళ్లలో అధికంగా వసూలు చేస్తున్నారనే రోపణలు వచ్చాయన్నారు.
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెలుగు ఆది కవయిత్రి మెుల్ల కాంస్యం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర, మైసూర్ మహారాజు, ఎంపీ, యదువీర కృష్ణదత్త చామరాజ వడియార్ పాల్గొన్నారు.
Andhrapradesh: సెబ్‌ను రద్దు చేస్తూ ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఎక్సైజ్ శాఖ అధికారుల హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల జేఏసీ నేత నరసింహం మాట్లాడుతూ... ‘‘మా ప్రమేయం లేకుండా, మా అభిప్రాయలు తీసుకోకుండా వైసీపీ ప్రభత్వం సెబ్ ఏర్పాటు చేసింది’’ అంటూ మండిపడ్డారు.
Andhrapradesh: మంత్రి కొల్లు రవీంద్రకు హైకోర్ట్‌లో ఊరట లభించింది. క్రిమినల్ కేసులతో సంబధం లేకుండా రవీంద్ర పాస్ పోర్ట్‌ను పునరుద్ధరించాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 20వ తేదిన మంత్రి విదేశాలకు వెళ్తుండటంతో వెంటనే క్లియర్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. తన పాస్‌పోర్టును పునరుద్ధరించాలని పాస్‌పోర్ట్ అధికారులను గతంలో రవీంద్ర కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసిందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సొంత ఆదాయం పెంచుకునేలా మద్యం పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా బుడమేరు వాగుకు వరద పోటు వచ్చిందనీ ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణాజిల్లా అతలాకుతలమైందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాలు గత వారం రోజులుగా నీటిలోనే ఉన్నాయని చెప్పారు.
Andhrapradesh: ప్రకాశం బ్యారేజీ బోట్స్ ఢీకొన్న వ్యవహారంలో కుట్ర కోణం దాగి ఉందని.. దానిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ మంత్రి కొల్లు రవ్రీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.
బుడమేరు గండి పూడ్చివేత పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పరిశీలించారు. ఈ మేరకు గండి పూడ్చివేత పనులపై మంత్రి నిమ్మల, అధికారులను అడిగి నారా లోకేశ్ వివరాలు తెలుసుకున్నారు.