Home » Kollu Ravindra
Andhrapradesh: మంత్రి కొల్లు రవీంద్రకు హైకోర్ట్‌లో ఊరట లభించింది. క్రిమినల్ కేసులతో సంబధం లేకుండా రవీంద్ర పాస్ పోర్ట్‌ను పునరుద్ధరించాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 20వ తేదిన మంత్రి విదేశాలకు వెళ్తుండటంతో వెంటనే క్లియర్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. తన పాస్‌పోర్టును పునరుద్ధరించాలని పాస్‌పోర్ట్ అధికారులను గతంలో రవీంద్ర కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసిందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సొంత ఆదాయం పెంచుకునేలా మద్యం పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా బుడమేరు వాగుకు వరద పోటు వచ్చిందనీ ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణాజిల్లా అతలాకుతలమైందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాలు గత వారం రోజులుగా నీటిలోనే ఉన్నాయని చెప్పారు.
Andhrapradesh: ప్రకాశం బ్యారేజీ బోట్స్ ఢీకొన్న వ్యవహారంలో కుట్ర కోణం దాగి ఉందని.. దానిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ మంత్రి కొల్లు రవ్రీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.
బుడమేరు గండి పూడ్చివేత పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పరిశీలించారు. ఈ మేరకు గండి పూడ్చివేత పనులపై మంత్రి నిమ్మల, అధికారులను అడిగి నారా లోకేశ్ వివరాలు తెలుసుకున్నారు.
Andhrapradesh: కుటుంబానికి దూరంగా పండుగరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద బాధిత ప్రజలతో ఉన్నారంటే అంతకంటే ఏముంటుందని గనుల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు వచ్చే దాకా చంద్రబాబు ప్రభుత్వం ప్రజల వెంటే ఉంటుందని స్పష్టం చేశారు.
Andhrapradesh: పీ వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పాటు.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షాలపై కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లతో మంత్రి కొల్లు రవీంద్ర శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీగా కురుస్తున్న వర్షాలపై ప్రజల్ని అప్రమత్తం చేయాలన్నారు.
Andhrapradesh: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థినిలు ఆందోళనను విరమించారు. కళాశాల హాస్టల్ వాష్ రూమ్‌ల్లో హిడెన్ కెమెరాల ఘటన కలకలం రేపింది. తమ జీవితాలను నాశనం చేశారంటూ విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఒక విద్యార్థి, విద్యార్ధినులు కలిసి కెమెరా అమర్చారని వారు ఆరోపించారు.
అచ్యుతాపురం(Achyutapuram) ఘటనను ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) మండిపడ్డారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లి రాజకీయాలు మాట్లాడడం సరికాదన్నారు. బాధితులను ఓదార్చాల్సింది పోయి రాజకీయ విమర్శలకు జగన్ దిగటం సిగ్గుచేటని మంత్రి రవీంద్ర ఆగ్రహించారు.
Andhrapradesh: సింహాచలం అప్పన్న స్వామిని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రికి ఆలయ ఈవో, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కప్పష్టంభం ఆలింగనం, గర్భగుడిలో మంత్రి కొల్లురవీంద్ర ప్రత్యేక పూజలు చేసి.. ఆపై వేదాశీర్వచనం పొందారు.