Home » Komati Reddy Venkat Reddy
‘‘తెలంగాణ తల్లి విగ్రహంపై కొంత మంది మాట్లాడుతూ తలపై కిరీటం లేదు, మెడలో నెక్లెస్ లేదు, ఒంటిపై పట్టు చీర లేదంటున్నారు. కానీ.. కిరీటం లేదన్న కారణంతో అమ్మను కాదంటామా’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు.
రాష్ట్ర సచివాలయంలో సోమవారం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో ఇకపై ఏటా డిసెంబరు 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఏడాది కాంగ్రెస్ పాలనపై చార్జ్‌షీట్ వేసేంత నైతికత బీఆర్ఎస్కు లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పడగానే దళితుడినే సీఎం చేస్తానని, ఇంటికో ఉద్యోగమిస్తామని చెప్పి.. అవి చేయలేకపోయిన కేసీఆర్‌పై అప్పుడు ఎందుకు చార్జ్‌షీట్ వేయలేదని మండిపడ్డారు.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హాజరయితే ఆయన గౌరవం పెరుగుతుందన్నారు.
తెలంగాణలో ఇక నుంచి విడుదలయ్యే సినిమాలకు ‘బెనిఫిట్ షో’లు వేసుకునేందుకు అవకాశం ఇవ్వబోమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
ప్రజాప్రభుత్వం ఏర్పడి ఈ నెల 7వ తేదీతో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల పక్కన రాజీవ్ ప్రాంగణంలో లక్ష మందితో ముఖ్యమంత్రి బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమ సమయంలో తాను కూడా దీక్ష చేశానని, మంత్రి పదవిని సైతం త్యాగం చేశానని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్ గురుకులాల గురించి మాట్లాడితే తాను జవాబు ఇవ్వనని, వాళ్లది తన స్థాయి కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురుకులాలపై కేసీఆర్ వచ్చి మాట్లాడితే తాను సమాధానం చెబుతానన్నారు.
ఫామ్ హౌస్‌లో ఉన్న కేసీఆర్ గురుకులాలకు పోదామంటే తాను వస్తాను.. కానీ పిలగాళ్లు కేటీఆర్, హరీష్ వాఖ్యలపై తాను మాట్లాడనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో కొట్లాడి నిధులు తెచ్చుకుంటామని తెలిపారు.
లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్ను కేవలం తెలంగాణలో ఎన్నికల ఖర్చుల కోసం రూ.7 వేల కోట్లకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అమ్ముకున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆక్షేపించారు. రాజకీయాల్లో హుందాతనం అవసరమని తెలిపారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు బుద్ధితెచ్చుకొని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.