Home » Komatireddy Rajgopal Reddy
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలుదాటుతోంది. అయితే ఇంకా పూర్తిస్థాయిలో మంత్రివర్గం కొలువుదీరలేదు. కేవలం రేవంత్తో పాటు 11మంది మంత్రులతో కేబినెట్ కూర్పు చేశారు.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, మార్పు, చేర్పులపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చేదెవరు..? ఉన్న మంత్రుల శాఖల మార్పు గురించి వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కీలక అప్ డేట్ ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణ ఉంటుందని.. కొందరి మంత్రుల శాఖల మారుతాయని తేల్చి చెప్పారు. మంత్రివర్గంలోకి ముగ్గురి నుంచి నలుగురిని తీసుకునే అవకాశం ఉంటుందని వివరించారు.
జిల్లాలోని మర్రిగూడెం మండలం చర్లగూడెం ప్రాజెక్ట్ భూనిర్వాసితులకు తాను అండగా ఉంటానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Rajagopal Reddy) హామీ ఇచ్చారు. ప్రాజెక్ట్ వద్ద భూ నిర్వాసితులతో మాట్లాడారు.
ఏపీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. నేడు ఆయన తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా..? లేక వైసీపీకీ పట్టం కడతారోనన్న ఉత్కంఠ నెలకొందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా.. జూన్ 2న ఉదయం 10:35 గంటలకు రాష్ట్ర గీతమైన ‘జయజయహే తెలంగాణ’ను ప్రభుత్వం జాతికి అంకితం చేయనుంది. మూడు చరణాలతో కూడిన రెండున్నర నిమిషాల వెర్షన్ను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. 10:35 గంటలకు మొదలుపెట్టి.. 10:37:30 సెకన్ల వరకూ ఈ గీతాన్ని వినిపించనున్నారు. దీంతోపాటు.. 13:30 నిమిషాల నిడివిగల పూర్తిగీతాన్ని కూడా సర్కారు ఓకే చేసింది.
తెలంగాణ కాంగ్రెస్ (Congress) పార్టీకి కొత్త బాస్పై ఉత్కంఠ నెలకొంది. అధ్యక్ష రేసులో ఎవరు ఉన్నారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇటు ఏ సామాజికవర్గానికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుదన్న విషయంపై ఏఐసీసీ కూడా దృష్టి సారించింది.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా రాయ్ బరేలికి క్యూ కట్టారు. రాహుల్ గాంధీ రాయ్ బరేలి నుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. రేపు లేదా ఎల్లుండి రాయ్ బరేలిలో ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. తెలంగాణ ఎన్నికలు ముగిసినందున రాయ్ బరేలిలో ప్రచారానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లారు.
పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా చేర్యాల పట్టణంలో భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధి చామల కిరణ్ కుమార్ రెడ్డి మద్దతుగా కార్నర్ మీటింగ్ జరిగింది. ఈ మసమావేశంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జనగామ జిల్లా అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో జోకర్ గాళ్ళు, బ్రోకర్ గాళ్ళు ఎక్కువని విమర్శించారు.
కేసీఆర్ ఎక్కువ తక్కువ మాట్లాడితే జైల్లో వేస్తామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి హెచ్చరించారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవుపలికారు.