Home » KonaSeema
అమలాపురం మహిపాలవీధిలోని శ్రీఅబ్బిరెడ్డి రామదాసు చెడీ తాలింఖానా 169వ వార్షికోత్సవ సన్నాహాక ప్రదర్శన బుధవారం శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో నిర్వహించారు. చెడీ తాలింఖానా గురువు అబ్బిరెడ్డి మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక సన్నాహాక ప్రదర్శనలో అధిక సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు. కర్రసాము, కత్తిసాము, బంతుల తాళ్లు, లేడి కొమ్ములు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
నదిలో నీటి ప్రవాహం తగ్గగానే ఇసుక తవ్వకాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో అన్నిశాఖల అనుమతులతో పన్నెండు ఇసుక రీచ్‌లను గుర్తించామన్నారు. జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం బుధవారం కలెక్టరేట్లో ఆర్.మహేష్‌కుమార్ అధ్యక్షతన జరిగింది.
Andhrapradesh: ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు. ఆ దేవదేవిని చూసేందుకు భక్తులు ఆలయాలకు తరలివస్తున్నారు. ఇదిలా ఉండగా.. కోనసీమలో ఓ అమ్మవారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అమ్మవారిని చూసి భక్తులు ఆశ్చర్యపోతున్నారు.
ధాన్యం సేకరణకు అధికారులు సర్వసన్నద్ధం కావాలని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. కోనసీమ జిల్లాలో 4.05 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రస్తుత సీజన్లో విక్రయానికి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కలెక్టరేట్లో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. రైతులకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందన్నారు. ధాన్యం కొనుగోలులో అక్రమాలు, పొరపాట్లు జరగకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలన్నారు. నవంబరు మొదటి వారంలోనే ధాన్యం సేకరణ ప్రారంభమవుతుందన్నారు.
అమలాపురం పురపాలక సంఘంలో చెరువుల ఆక్రమణలు.. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన విగ్రహాలు.. రక్షిత తాగునీటికి బదులు కుళాయిల ద్వారా మురుగునీరు సరఫరా అంశాలపై అధికార, విపక్ష కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షిత తాగునీటిని సరఫరా చేసి ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉందన్నారు.
గ్రామ, మండల స్థాయిలో ప్రతి అర్జీని సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ మహేష్‌కుమార్ ఆదేశించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని చెప్పారు. మండపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.
ప్రభుత్వ మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు వ్యాపారులు సిండికేట్ అయ్యారు. లాబీయింగ్‌లతో రాజకీయ పార్టీలకు అతీతంగా మద్యం వ్యాపారులంతా ఒక్కటై సిండికేట్లకు రూపకల్పన చేస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని 133 ప్రభుత్వ మద్యం దుకాణాల కోసం ఇప్పటి వరకు 300కు పైగా దరఖాస్తులు దాఖలైనట్టు సమాచారం. రానున్న మూడు రోజుల గడువులో వీటి సంఖ్య మరింత పెరగనుంది.
కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తజనం పోటెత్తారు. వేకువజామునే స్వామి వారికి సుప్రభాతసేవ, నీరాజన మంత్రపుష్పం, ఐశ్వర్యలక్ష్మి హోమం, బాలబోగం తదితర కార్యక్రమాలను శాస్రోక్తంగా నిర్వహించి మూలవిరాట్‌ను వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు
గోదావరిలో వరద నీరు తగ్గిన వెంటనే ఇసుక ర్యాంపులలో తవ్వకాలకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి పూర్తిస్థాయిలో ఇసుక ర్యాంపుల నుంచి తవ్వకాలు నిర్వహించాలని సూచనలు చేసిన నేపథ్యంలో ర్యాంపులను పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు.
కోటిపల్లి-ముక్తేశ్వరం ఫెర్రీ రేవు మూతపడడంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం వెళ్లడానికి రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల ప్రజలతో పాటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్లే అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.