Home » Konda Surekha
సినీనటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసులో డిసెంబర్ 12వ తేదీన విచారణకు హాజరుకావాలని మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీచేసింది.
మంత్రి కొండా సురేఖకు నాంపల్లిలోని ప్రజా ప్రతినిదుల కోర్టులో బిగ్ షాక్ తగిలింది. అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. మంత్రి వ్యాఖ్యలను అక్కినేని నాగార్జున తీవ్రంగా ఖండించారు.
మంత్రి కొండా సురేఖపై నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం దావాపై నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఎక్సైజ్ కోర్టులో గురువారం విచారణ జరిగింది.
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారాన్ని రేపాయి. కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తూ అక్కినేని ఫ్యామిలీని కూడా మంత్రి కొండా సురేఖ ప్రస్తావనకు తీసుకువచ్చారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం కేటీఆర్ అలవాటు అని ఆరోపించారు. వారికి డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆరే అని, కేటీఆర్‌కు తల్లి అక్క, చెల్లి లేరా? అని ప్రశ్నించారు.
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన క్రిమినల్ పరువు నష్టం దావాపై తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా పడింది.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన సాగుతోందని మంత్రులు కొండా సురేఖ, సీతక్క కొనియాడారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధిపై దృష్టి సారించారని మంత్రి కొండా సురేఖ అన్నారు. లగచర్ల ఘటన కలెక్టర్‌పై దాడి మాజీ మంత్రి కేటీఆర్ పనే అని ఆరోపించారు. కేటీఆర్ వెనక ఉండే దాడి చేయించారని విమర్శలు చేశారు. అమాయకులను బలి చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు.
మరో వందేళ్లు చెక్కుచెదరకుండా ఉండేలా వేములవాడ రాజరాజేశ్వర దేవాలయాన్ని అభివృద్ధి చేసేలా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారుల్ని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.
Telangana: రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తోపులాటలో చిక్కుకుపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటనలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, అధికారులు ఉన్నప్పటికీ మంత్రి తోపులాటలో ఇరుక్కుపోవడం చర్చనీయాంశంగా మారింది.
‘రాహుల్‌గాంధీ కులం ఏంటన్నది తెలియాలంటే దేశంలో కులగణన చేయండి. కులగణన పత్రంతో రాహుల్ ఇంటికి వెళితే.. తన కులమేదో ఆయనే చెబుతారు’ అంటూ బీజేపీ నేతలకు మంత్రి కొండా సురేఖ సలహా ఇచ్చారు.