Home » KTR
కాంగ్రెస్ ప్రభుత్వం ఎడాపెడా చేస్తున్న అప్పుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఫార్ములా-ఈ రేసు కేసును ముందుకు తెచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. కేటీఆర్‌ను ఈ నెల 30 వరకు అరెస్ట్ చేయరాదంది.
ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు వ్యవహారం తెలంగాణలో పెద్దఎత్తున రాజకీయ దుమారం లేపుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై ఏసీబీ నమోదు చేసిన కేసు విషయమై హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ(శుక్రవారం) విచారణ చేపట్టిన ధర్మాసనం వారం రోజులపాటు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దంటూ తీర్పు చెప్పింది.
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఊరట లభించింది. వారం రోజుల వరకూ కేటీఆర్‌ను అరెస్టు చేయెుద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Telangana: ఫార్ములా ఈరేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. కేటీఆర్ తరపున లాయర్ సుందరం వాదనలు వినిపించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఏసీబీ కేసు నమోదు చేశారని న్యాయవాది సుందరం కోర్టుకు తెలిపారు.
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. భూ భారతి బిల్లుపై చర్చను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు.
Telangana: మాజీ మంత్రి కేటీఆర్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారించేందుకు తెలంగాణ హైకోర్టు అంగీకరించింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని హైకోర్టును మాజీ మంత్రి ఆశ్రయించారు.
ముసుగు వేసుకుని బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని మంత్రి సీతక్క విమర్శించారు. జైలుకు వెళ్లి యోగా చేస్తానన్న కేటీఆర్ ఎందుకు బయపడుతున్నారని మంత్రి సీతక్క ప్రశ్నించారు.
ఫార్ములా ఈ కారు రేసు కేసుపై ఈడీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. కేటీఆర్‌పై నమోదైన కేసు వివరాలు.. ఎఫ్ఐఆర్తోపాటు హెచ్ఎండీఏ అకౌంట్ నుంచి ఎంత బదిలీ చేశారో వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది.
Telangana: ఫార్ములా ఈకార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు అవడంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. చట్టపరంగా కేసు నమోదు అయినందున దీనిపై అసెంబ్లీలో కాదు, కోర్టులో తేల్చుకోవాలని సలహా ఇచ్చారు.