Home » KTR
KTR vs Revanth: లగచర్ల ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ మరోమారు రియాక్ట్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్గా చేసుకొని ఆయన విమర్శలకు దిగారు. ఇంతకీ కేటీఆర్ ఏమన్నారంటే..
తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ తీరును ఎండగట్టడమే లక్ష్యంగా కేటీఆర్ పెట్టుకున్నారు. లగచర్ల ఘటనపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. రాహుల్, రేవంత్ రెడ్డిల తీరును ఢిల్లీలో ఎండగట్టాలని నిర్ణయించింది. సోమవారం సాయంత్రం 3 గంటలకు ఢిల్లీలోని కాన్యూస్టూషన్ క్లబ్లో కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.
‘‘రాష్ట్రంలో ఇద్దరు ముఖ్యమంత్రులు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారిలో ఒకరు రేవంత్రెడ్డి కాగా, మరొకరు కేటీఆర్. ఇక్కడ ఆర్కే (రేవంత్రెడ్డి, కేటీఆర్) బ్రదర్స్ పాలన నడుస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కమల దళం రక్షణ కవచంలా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. లగచర్ల ఘటనను పక్కదారి పట్టించేందుకే కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మూసీ నిద్ర అంటున్నారని తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఏఐసీసీ సంతృప్తి వ్యక్తం చేసిందంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
ఢిల్లీలో సెటిల్మెంట్ చేసుకోవడంతో మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ కథ కంచికి పోయిందిని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఈ ఫార్ములా, ధరణి స్కాం కేసులన్నీ గాలికే పోయాయని విమర్శలు చేశారు.
‘మూసీ’ పేరిట సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి మూటలు మోస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలకు డబ్బులు కావాలని, అందుకే రేవంత్ మూటలు పంపే పనిలో ఉన్నారని విమర్శించారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మూసీ నిద్ర ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. బీజేపీ నేతల మూసీ నిద్ర వల్ల ఒరిగేది ఏమీ ఉండదని అన్నారు. మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
సీఎం రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రజల పాలిట రాబందులా మారారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం నిర్ణయాలతో ప్రజలు రోదిస్తున్నారని, ఆక్రోశిస్తున్నారని తెలిపారు.
రైతులను బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు గురి చేస్తున్నారని మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. రైతు సమస్యలను తమ ప్రభుత్వం త్వరగా పరిష్కరిస్తుందని రైతులు ఆందోళన పడవద్దని అన్నారు.