Home » KTR
రైతులను బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు గురి చేస్తున్నారని మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. రైతు సమస్యలను తమ ప్రభుత్వం త్వరగా పరిష్కరిస్తుందని రైతులు ఆందోళన పడవద్దని అన్నారు.
Telangana: హైదరాబాద్ శివార్లలో ఫార్మాసిటీ కేసీఆర్ పెడితే రేవంత్ వాళ్ల కుటుంబ సభ్యుల కోసం మార్చారని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ బాధితులకు అండగా ఉంటారన్నారు. ‘‘మేము అధికారంలోకి వచ్చాక నిన్ను ఏం చేయాలో మాకు తెలుసు’’ అని అన్నారు. జైల్లో వేసిన కుటుంబాల ఉసురు తాకుతుందన్నారు. బాధితులకు అండగా బీఆర్ఎస్ ఉంటుందని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం సంగారెడ్డి జిల్లాకు వెళ్లనున్నారు. ఉదయం 9:30 గంటలకు నందినగర్‌లోని తన నివాసం నుంచి కేటీఆర్ సంగారెడ్డికి బయలుదేరనున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేతలతో కలసి 11 గంటలకు సంగారెడ్డికి చేరుకోనున్నారు. జైలులో ఉన్న లఘుచర్ల గ్రామ రైతులను కేటీఆర్ బృందం పరామర్శించనుంది.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేటీఆర్, హరీశ్‌రావు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అధికారులపై దాడులకు పాల్పడితే ప్రతిదాడులు తప్పవని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు.
‘11నెలల నుంచీ ఈ ప్రభుత్వం పని వదంతులు, ఇచ్చికాల మాటలు. చెవులు కొరకడమే. నేను డ్రగ్స్ తీసుకోలేదు, ఫోన్లు ట్యాపింగ్ చేయలేదు, అవినీతి అంతకన్నాచేయలేదు. గతంలో మోదీని ఉద్దేశించి.. మోడీయా.. బోడీయా ఏం పీక్కుంటారో పీక్కో అన్నాను.
ఇటీవల వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై జరిగిన దాడి సంఘటనలో మాజీ మంత్రి కేటీఆర్ హస్తం ఉందని, విచారణ పకడ్బందీగా జరపాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
బీఆర్ఎస్ నేతలపై రేవంత్ ప్రభుత్వం బోగస్ కేసులు పెడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. లగచర్ల బాధితులను బాధితులను ఢిల్లీకి తీసుకెళ్తామని... నేషనల్ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేయిస్తామని కేటీఆర్ హెచ్చరించారు.
అవినీతి ఎక్కడ జరిగినా విచారణ జరపాలన్నది తమ డిమాండ్ అని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం మీద సీబీఐ విచారణకు డిమాండ్ చేశామని, సీఎం రేవంత్ రెడ్డి విచారణ కోరారా.. అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు.
కలెక్టర్‌పై దాడి చేసినవారు ఎవరైనాసరే వదిలేది లేదని.. 90 శాతం మంది రైతులు ఫార్మా కంపెనీ కోసం అంగీకరిస్తే.. సంబంధం లేని వ్యక్తులు దాడి చేశారని, ఇది కుట్రలో భాగంగానే దాడి జరిగిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాజకీయాల కోసం కేటీఆర్ చిల్ల వేషాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.